రైతుల పొలాలకు నీరు అందించడమే లక్ష్యం

– మక్తల్ పెద్దచెరువు ప్రధాన కాలువలో పూడికతీత పనులు ప్రారంభం

– మక్తల్ మత్స సహకార సంఘం సభ్యులతో కలిసి కాంగ్రెస్ నాయకుల పూజ కార్యక్రమం

– రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి తమ్ముడు వాకిటి శేషగిరి

నారాయణపేట, సెప్టెంబర్ 28 (జన ఉదయం ప్రతినిధి)

మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, ఆయన సోదరుడు వాకిటి శేషగిరి ఆధ్వర్యంలో సంగంబండ డ్యాం నుంచి మక్తల్ పెద్దచెరువుకు వచ్చే ప్రధాన కాలువలో పూడికతీత పనులను సోమవారం మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు వాకిటి శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి చందాపురం చంద్రశేఖర్, వల్లంపల్లి లక్ష్మణ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.
ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడిక, మట్టి, చెత్తను తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతున్నారు. తద్వారా సాగునీరు సక్రమంగా ప్రవహించి రైతుల పొలాలకు నీరు చేరేలా ఈ పనులు కొనసాగునున్నాయి.
ఈ సందర్భంగా వాకిటి శేషగిరి మాట్లాడుతూ, మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ప్రతి రైతు పొలానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన సూచనలు చేశారని తెలిపారు. రైతుల సంక్షేమం, సాగునీటి సమస్యల పరిష్కారం పట్ల మంత్రి శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.
రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రధాన కాలువలో పూడికతీత పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, అవసరమైన చోట్ల కాలువలను పరిశీలించి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామని వాకిటి శేషగిరి తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు, నీల గౌడ్, గోవిందరాజ్,డాక్టర్ శంకర్, మంజూరిలాయి, నరసింహ మామిళ్ళ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.