తృప్తి తరంగాలు…సంతోష తీరాలు

నారాయణపేట, సెప్టెంబర్ 28 (జన ఉదయం ప్రతినిధి)

“కోరికల వెనక పరిగెత్తే
మనసును ఆపినప్పుడే
మనిషి తనలోని అసలైన
సంతోషాన్ని కనుగొనగలడు.
సంతృప్తి లేని విజయం ఒక
అసంపూర్ణ ప్రయాణం మాత్రమే “

ఆశల అగాధం దాటిన నాడు
హృదయం ఒక నందన
వనమౌతుంది అంతూ లేని
కాంక్షలు వీడిన క్షణాన
సంతోషం ఉప్పొంగుతుంది

ఉన్నదానితో మురిసిపోయే
గుణమే జీవితానికి నిండైన
అందం కలలు కంటూనే
సాగాలి ప్రయాణం
శ్రమిస్తేనే విజయం సిద్ధిస్తుంది

దిగంతాల వైపు సాగే నీ పరుగుల
వేటలో కనుమరుగవుతుంది
క్షణికమైన నీ ప్రశాంతత

కలలు కనడం ప్రగతికి మూలం
ప్రయత్నం మానవ ధర్మం కానీ
భ్రమల వెనుక పరిగెత్తుడం
వృధా ప్రయాసల మర్మం
కోట్లు కూడబెట్టినా దక్కని
ఆ నిచ్చింత నవ్వులో ఉంది
ఆత్మీయత

ఓం మనిషి వెండి కనకం వజ్ర
వైడుర్యాలు కూడబెడుతున్నావు
కానీ అమూల్యమైన సంతోషాన్ని
కోల్పోతున్నావు సంపాదన
ఆరాటంలో

నింగిని చూడు నేలను చూడు
ప్రకృతినుండి పాఠం నేర్చుకో
పారే సెలయేటి అలల సవ్వడిలో
ఎన్నెన్ని సంతోషాలు ఉన్నాయో
ఎండ మావుల భ్రమల
వలయంవీడి అంతరంగాన్ని
గమనించుకో

ప్రతి ఉదయం ఒక కొత్త
వరమంటూ ఈ జీవన
లయను ఆస్వాదించుకో
సంతృప్తి అనే అమృత
భాండాన్ని నీగుండెల్లో నింపుకో

ఆస్తులు అంతస్తులు అధికారాలు
ఆడంబరాలు కాదు మనశాంతే
పరమ భాగ్యం ప్రేమతో పంచే
ఆనందమే మానవ జన్మకు సార్ధకం

ఆశల భంథీవి కాకుండా చుట్టూ
ఉన్న ప్రపంచాన్ని ప్రేమించు
నీ అంతరంగ సామ్రాజ్యాన్ని
దర్శించు

పరిమితి లేని కోరికల వలయం
ఒక మానసిక బంధం
సంతృప్తిమించిన సామ్రాజ్యం లేదు

స్వార్థపు తెరలు తొలగిన వేళ
సంతోషం నీ నీడై వస్తుంది
త్యాగనిరతిని చాటుకో ఆశల
బంథీవి కాక అందిన జీవితాన్ని
అద్భుతంగా మార్చుకో

సంతృప్తి నీ ఆయుదమైతే
ఏ కష్టమైనా లొంగుతుంది
మనసున తృప్తి తరంగాలు
ఎగసి ఆనందపు వెల్లువలు
కురిసిన నాడు జీవిత నౌక
సురక్షితంగా చేరును
విజయతీరాలకు

ఎప్పుడైతే మీ హృదయంలో
సంతృప్తిని తరంగాలు
ఎగిసిపడతాయో అప్పుడే
మీ జీవితం సంతోషం అనేశాశ్వత
తీరాలకు చేరుకుంటుంది
మీసంతోషాన్ని వస్తువులలో కాదు
మీ అంతరంగంలో వెతుక్కోండి

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్ 9440245771

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.