అద్వానంగా మక్తల్ మున్సిపాలిటీ అధికారుల, కామాటీల పనితీరు

• కుర్చీకే పరిమితం అవుతున్న కమిషనర్

• వాటర్ ట్యాంకులు ఓవర్ ఫ్లో అవుతున్న పట్టించుకోని తీరు

• ప్రధాన వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో నీరు గంజి కి వెళ్లే దారిపై పారుతున్న మురుగునీరు

• కూరగాయలు విక్రయించే షాపుల ముందు మురుగునీరు

• మున్సిపల్ అధికారులకు సిబ్బందికి ఎన్ని మార్లు చెప్పిన పట్టించుకోరు అంటున్న షాపుల వారు

నారాయణపేట, సెప్టెంబర్ 3 (జన ఉదయం ప్రతినిధి)

మక్తల్ మున్సిపాలిటీ అధికారులు కామాటీల పనితీరు ఏమాత్రం సక్రమంగా లేదంటూ ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వైపు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. మక్తల్ పట్టణంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి,  ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న వాటిపై కమిషనర్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం రెన్ సీజన్లో ఎక్కడ కూడా మురుగునీరు ప్రవహించకుండా ఆయా వార్డులలో శుభ్రంగా ఉండాలంటూ చెప్పినప్పటికీ మక్తల్ మున్సిపల్ తో మాత్రం అవేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అధికారులు మున్సిపాలిటీ వర్కర్లు. 167 వ జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ప్రధాన వాటర్ ట్యాంక్ పక్కనే గల మరో వాటర్ ట్యాంక్ నుండి నీరు ఓవర్ ఫ్లో అవుతూ చెరువుల తలపిస్తూ అట్టి నీరు నెహ్రూగంజ్ కి వెళ్లే దారిలోని ఎడమవైపు ఉన్న సెటర్ నుండి మురుగునీరు బయటకు వస్తూ పడమటి ఆంజనేయస్వామి దేవాలయ పక్కనే గల కూరగాయలు విక్రయించే స్వెటర్లు ముందు మురుగునీరు ప్రవహిస్తున్న ఏ ఒక్కరు పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు,అక్కడి కూరగాయలు విక్రయించే యజమానులు, కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వారు  తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అసలు సమస్య ఇక్కడ ఉంది బాబు అని మొత్తుకున్నప్పటికీ ఏ ఒక్కరు స్పందించరు అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.

అవసరము లేని చోట అన్ని….

ప్రజా అవసరాలలో భాగంగా మున్సిపాలిటీ ద్వారా నిర్వాణ కొనసాగుతున్నటువంటి తాగునీరు కానివ్వండి విద్యుత్తు దీపాలు కానివ్వండి ప్రజలు ఉన్నచోట ఉండకుండా ఎక్కడో మారుమూల ప్రాంతంలో 24 గంటలు విద్యుత్తు దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఒక్క ఇల్లు ఉన్నప్పటికీ అక్కడ తాగునీరు వృధాగా వెళుతూనే ఉంటుంది కానీ జన సందోహం ఉన్న దగ్గర మాత్రము తాగునీటికి ప్రజలు తల్లడిల్లుతున్న ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ కమిషనర్ ఒక్కరోజు వచ్చి చూసిన పాపాన లేదు ఇదే అదునుగా భావిస్తూ నీళ్లు వదిలే వారు కానివ్వండి ప్లంబర్లు కానివ్వండి ఎవ్వరు పట్టించుకునే నాధుడే లేరు అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మక్తల్ పట్టణంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించే ప్రక్రియలో భాగంగా పైప్ లైన్లు వేస్తున్నప్పటికీ ప్రధాన రోడ్లు తవ్వు తున్న సందర్భంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండవలసిన తీరు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది చూడవలసింది కానీ ఎవరు ఎక్కడ తవుతున్నారు? ఏ విధంగా తవ్వుతున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందు కలుగుతున్నాయి అన్న వాటిపై కమిషనర్ కు నయా పైసా అవగాహన లేకపోవడం మక్తల్ ప్రజల దౌర్భాగ్యం అంటూ ప్రజల ఆరోపిస్తున్నారు. ఈ కమిషనర్ ఎప్పుడూ చేతులు కట్టుకొని నిలబడడం తప్ప తన అధికార బలముతో ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎందుకు జరగడం లేదు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వాటి సమస్య పరిష్కారం మార్గాలు ఏమిటి అన్న ఆలోచన మాత్రం ఈ కమిషనర్ కి ఏమాత్రం అవగాహన  లేదని ప్రజలు అంటున్నారు. ఇంతకు మక్తల్ మున్సిపాలి కమిషనర్ ఉన్నారా అన్న ప్రశ్న తలెత్తుతుందని ప్రజలు అంటున్నారు.

మురుగునీరు రాకుండా చూడండి…

మక్తల్ నెహ్రూ  గంజికి వెళ్లేదారిలో వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో ద్వారా షెటర్ల కింద నుండి వస్తున్న మురుగునీటిని అరికట్టాలంటూ దారి నుండి వెళ్లే ప్రజలు కానివ్వండి కూరగాయల విక్రయించే వారు కానివ్వండి మున్సిపాల్ అధికారులకు తెలియజేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా ఆ వార్డ్ కౌన్సిలర్లకూ,మున్సిపల్ చైర్మన్ కూ ఇట్టి సమస్యలు దృష్టికి రావడం లేదా సమస్యలు ఏమైనా ఉంటే కమిషనర్ మున్సిపల్ చైర్మన్ తో చర్చిస్తూ సమస్యల పరిష్కారానికి తోడ్పడవలసి ఉంటుంది కానీ మక్తల్ పట్టణంలోని కౌన్సిలర్ మధ్య అధికారుల మధ్య చైర్మన్ ల మధ్య సమన్వయం లోపిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మక్తల్ ప్రాంత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందిస్తూ మురుగునీరు రోడ్ల పైన ప్రవహించకుండా వాటికి మరమ్మతులు చేయవలసిన బాధ్యత వారి పైన ఉందంటు పట్టణ ప్రజలు అంటున్నారు.

 అమ్మ కలెక్టర్ అమ్మ ఒకసారి మక్తల్ మున్సిపాలిటీ అధికారుల   తీరు చూడండి…

 అమ్మ కలెక్టర్ అమ్మ మక్తల్ మున్సిపాలిటీ అధికారుల కామాటీల తీరుపై ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు అవసరమున్న దగ్గర వదలరు విద్యుత్తు అవసరం ఉన్న దగ్గర పెట్టరు రోడ్లపై చెత్త కనిపిస్తున్న తీయరు. మక్తల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మంత్రి వాకిటి శ్రీహరి ముందడుగు వేస్తున్నప్పటికీ ఈ అధికారుల తీరు మాత్రం ఆయన పని విధాన్ని వెనక్కి పట్టి లాగుతున్నట్టు కనబడుతుంది అంటూ ప్రజల ఆరోపిస్తున్నారు. ఒక మంత్రి ఇలాగాలో మున్సిపాలిటీ పనితీరు ఎలా ఉండాలి ఇక్కడ పనిచేసే వారికి ఏమాత్రం భయం లేకుండా ఉందన్నది నిజం అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. తమరైన ప్రత్యేకంగా వీరికి క్లాస్ తీసుకుంటూ మక్తల్ మున్సిపాలిటీ పనితీరుపై సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *