– మాజీ ఎమ్మెల్యే చేతికి రాఖీ కట్టిన కౌన్సిలర్ కాకర్ల.
నారాయణపేట, సెప్టెంబర్ 2( జన ఉదయం ప్రతినిధి)
మీ ఆత్మీయత అనురాగం కలకాలం ఇలాగే ఉండాలని నారాయణపేట జిల్లా కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి చేతికి మూడో వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ రాఖీ కట్టి మిఠాయిని తినిపించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ మాట్లాడుతూ మీ అండదండలతో మూడో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఎస్ రాజేందర్ రెడ్డి హయాంలో రెండో వార్డులోని ప్రజల సమస్యలను పరిష్కరించామని అన్నారు. మూడవ వార్డును కూడా అలాగే అభివృద్ధి చేసేందుకు మీ సహాయ సహకారాలు ఎప్పటికీ నాపై ఉండాలని కోరారు. వార్డు సమస్యలను పరిష్కరించేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీ అండ కూడా మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు.
