– స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికయి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేరడగం సర్పంచ్
నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం న్యూస్)
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం
నేరడగం గ్రామ సర్పంచ్ అయినా దాసరి వెంకటమ్మ సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసి గ్రామ ప్రజల మన్ననలు పొంది ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.
సంవత్సరం పాలన గడిచినప్పటికీ పాలనాపరంగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి గాని పనులు గాని కాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ నేడు మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సర్పంచ్ ను,వార్డు మెంబర్లను,పార్టీలోకి ఆహ్వానించారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ దాసరి వెంకటమ్మ,నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు,ఇతర పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
ప్రజల మాట…
అధికార పార్టీ ఉంటూ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మంత్రి స్థానంలో ఉన్నప్పటికీ జరగలేని అభివృద్ధి మాజీల చెంతకు చేరితే అభివృద్ధి సాధ్యమా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. పదవి కాలమైపోయింది కేవలము సంవత్సరము మాత్రమే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి సమయం దగ్గర పడుతున్న కొద్ది అభివృద్ధి పొలాలు అందుతుండొచ్చు అంటూ ప్రజానీకం అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజా ప్రభుత్వం పై అభివృద్ధి జరగడంలో తీవ్ర నిరుత్సాహంతో ఉన్న నేపథ్యంలోనే నేరడగం సర్పంచ్ దాసరి వెంకటమ్మ టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుందని చెప్పవచ్చు.
