నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)
కృష్ణ మండల పరిధిలోని తంగిడి గ్రామంలో నూతనంగా బీజేవైఎం గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మాగనూరు కృష్ణ ఉమ్మడి మండల బిజెపి అధ్యక్షుడు నల్ల నర్సప్ప ఆధ్వర్యంలో ఇట్టి గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప మాట్లాడుతూ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్త నిరంతరం ఈ దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పాటుపడుతూ సమాజ హితమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారని అన్నారు.
తంగిడి బీజేవైఎం గ్రామ కమిటీ అధ్యక్షులుగా కున్సీ సచిన్, ఉపాధ్యక్షులుగా గురజాల నాగరాజు, బాగ్లి మారెప్ప లను ఏకగ్రీవ ఎన్నుకోవడం జరిగింది.
