– 1000 రోజుల ప్రజా పాలన పై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం..
– మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో మక్తల్ లో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి…
– పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు…
నారాయణపేట, సెప్టెంబర్ 3 (జన ఉదయం ప్రతినిధి)
బీఆర్ఎస్ నాయకులు మత్తు వదులుకుని నిజం తెలుసుకోవాలని, 1000 రోజుల ప్రజా పాలనలో మక్తల్ నియోజకవర్గం లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతామని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఏ రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
సోమవారం మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయలు సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ
బీఆర్ఎస్ నాయకులు పదేళ్ల కాలంలో మక్తల్ లో అభివృద్ధి ని పడకేశారని, కనీసం నియోజకవర్గం లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…ఈ నెల 10వ తేదీ వరకు ప్రతి రోజూ అభివృద్ధి పనులపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
అందులో భాగంగా గురువారం రూ.48 కోట్లతో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. దాదాపు పనులు పూర్తయ్యాయని, దసరాలోపు ఆసుపత్రి ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తట్టెడు మట్టి తీయలేదని, మత్తు వదిలి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి గారు నియోజకవర్గం ను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్,
మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, శివరాం రెడ్డి,విజయప్ప గౌడ, మాజీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయి ఫైనాన్స్ శీను ,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికుమార్, కౌన్సిలర్లు రహీం పటేల్ , నీలప్ప, కలాల్ శ్రీవిద్య నీలాగౌడ్, గోవిందరావు, వెంకటేష్, మహమ్మద్ అఫ్రోజ్ , వాకిటి భాస్కర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
