డ్రగ్స్,మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు

• కోటకొండ గ్రామంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు

• రూరల్ ఎస్ఐ సతీష్ రెడ్డి

నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నారాయణపేట మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ రోజు నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రూరల్ ఎస్ఐ సతీష్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా బస్ స్టాండ్ పాన్ షాపులు, కిరణం తదితర ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ప్రజలు ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నా, రవాణా చేస్తున్నా లేదా సరఫరా చేస్తున్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పీసీ పరమేశ్ , తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *