• సరాప్ నాగరాజు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కమిటీ జిల్లా కన్వీనర్
• నీలప్ప ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కమిటీ మక్తల్ నియోజకవర్గ కన్వీనర్
నారాయణపేట, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని సరప్ నాగరాజు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కమిటీ జిల్లా కన్వీనర్, నీలప్ప ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కమిటీ మక్తల్ నియోజకవర్గ కన్వీనర్ లు అన్నారు. శుక్రవారం
స్థానిక మక్తల్ ప్రాంతంలో నీలప్ప ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కమిటీ నియోజకవర్గ కన్వీనర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య వక్తగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో పాల్గొన్న పార్టీ, ప్రజా,విద్యార్థి ఉద్యమ సంఘ నాయకులలు హాజరయ్యారు.
ఈ సమావేశానికి సరప్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసులైన జైలుకు పంపించిన బైండోవర్ కేసులు పెట్టిన అదరక బెదరక నిలబడిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపులు ఇవ్వాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి నెలకు రూ.25000 పెన్షన్ వచ్చే విధంగా అట్లాగే 250 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చి దానికే తెలంగాణ ఉద్యమకారుల కాలనీ లుగా గుర్తించాలని అన్నారు. అలాగే
ఫ్రీ బస్ పాస్ లు , హెల్త్అ కార్డు లు ఇవ్వాలని అన్నారు.
అనంతరం తన ఉద్యమకారుల హక్కుల సాధన కమిటీ మక్తల్ డివిజన్ కన్వీనర్ గా లీలప్ప ముదిరాజ్ను ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం లో అబ్దుల్ జహీద్ మంగ్య నాయక్ రమేష్రై గౌడ్ కడెం పల్లి మోహన్రై తు సంఘం జిల్లా అధ్యక్షులు భగవంతు బీజేపీ నాయకులు కల్లూరి నాగప్ప ప్రజా ప్రాంటు మాజీ నాయకులు కర్రెమ్ కృష్ణ తెలంగాణ ఉద్యమ నాయకులు రాంలింగం కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏజీ భుట్టో విద్యార్థి సంఘం నాయకులు బి భాస్కర్ మాజీ కౌన్సిలర్ చీరాల సత్యనారాయణ తెలంగాణ ఉద్యంలో పాల్గొన్న ఫొటో గ్రాఫర్ అంబదాస్ ఉద్యమ నాయకులు మంథన్ గోడ్ కృష్ణ మాగనూర్ మండల నాయకులు మల్లేష్ నర్వ మండల నాయకులు ఖాజా ఉట్కూర్ మండల నాయకులు కృష్ణమినాన్ పాల్గొన్నారు.
