మహబూబ్ నగర్, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)
• సెప్టెంబర్5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా….
గురువు అంటే”త్రిమూర్తి”స్వరూపం తల్లి తల్లిదండ్రులు జన్మనిస్తే ఆజన్మకు సార్ధకత నేర్పిన దైవం గురువు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించి పుస్తకంలోని
పాఠాలనే కాదు బతుకు పుస్తకంలోని విలువలునేర్పుతాడు ఓటమితో కుంగి పోకుండాగెలుపు వైపు నడిచే ధైర్యాన్ని ఇస్తాడు జీవితానికి అర్థం కల్పిస్తాడు అజ్ఞాన అంధకారం నశింప చేసి వెలుగు వైపు నడిపిస్తాడు మంచి చెడుల వివక్షను తెలిపిబతుకు బండి నడుపు బాట చూపి జీవన సమరంలో సమస్యలపరిష్కార మార్గదర్శి గురువు జీవన విద్యలో మెలుకువలు చెప్పి సృజనను తీర్చిదిద్దే శిల్పిఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను ప్రేరేపించి అభ్యుదయ భావాలను ఆవిష్కరించి అభివృద్ధికి దశ దిశ నిర్దేశిస్తాడు మనిషి జననం నుండి మరణించే
వరకు ప్రతి విషయంలో గురువు
ఉంటాడు భారతీయ సంస్కృతిలో
గురువు పరంపర ప్రత్యేకతను
సంతరించుకుంది గురువు భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్త అజ్ఞానంగా వున్న మనకు విజ్ఞానం బోధిస్తాడు
అదమరిచి వున్న మనకు అర్థశాస్త్రం బోధిస్తాడు ఆర్థిక
అక్షరాస్యత పరిజ్ఞాన పరవ్యాప్తి స్పృహను పెంచుతాడు పౌరశాస్త్రం చరిత్ర చెప్పి సంస్కృతి పాలన ధర్మ రక్షణ పట్ల కార్యోన్ముఖులను చేస్తూ వెన్నంటి వుండే కొండంత అండ గురువు పామరులను పండితులను చేసే నిర్మలమైన స్వచ్చమైన ప్రేమాప్య్యాయతలు చూపే దైవం గురువు గురువు విద్యతో పాటు వినయం విచక్షణ తాత్వికత తార్కికత నేర్పిస్తాడు పరిశీలన పరికల్పన పరిశోధన వివరణ విశ్లేషణా శక్తి సామర్ధ్యాల
ఉద్దీపనకు ఉత్ప్రేరకంగా నిలుస్తాడు చీకట్లను తొలిగించి
వెలుగులు పంచే దివ్వె గురువు జీవితానికి గమ్మ్యాన్ని మార్గనిర్దేశం చేసే మహర్షి గురువు ఉన్నత స్థాయిలో శిష్యుల ప్రగతికి పాటుపడి దారి చూపే జ్ఞాన జ్యోతి గురువు సమాజంలో అజ్ఞానాన్ని తరిమి విజ్ఞానాన్ని పెంచి మంచి తనం పంచి మెరుగైన సమాజ రూపశిల్పి గురువుమత్తుపదార్థాల చీకటి లోయల్లో యువత దారి తప్పుతుంటే ఓటమి అనే చిన్న భయానికివిద్యార్థి తనువు చాలిస్తుంటేపాఠాలు చెప్పటానికి మాత్రమే పరిమితం కాకుండా ఆశావహ దృక్పథాన్ని పెంచేవాడు గురువు విదార్థుల ప్రాణాలు కాపాడే రక్షకుడు గురువు
గురువు పుస్తకాల మార్కుల వేటలో విద్యార్థుల మానసిక ఒత్తిడిని గమనించి స్నేహితుడై వెన్నుతట్టి గుండెల్లో ధైర్యాన్ని నింపుతాడుడ్రగ్స్ మాఫియా రక్కసివిదార్థుల భవిష్యత్తును
బూడిద పాలు కాకుండాతరగతి గదిలో అవగాహన పెంచి కంటికి రెప్పలా కాపాడే వాడు గురువు
మానసిక బలాన్ని నూరిపోసి
సంస్కారాన్ని ఆయుధంగా మార్చే వాడు గురువు దారి తప్పుతున్న నేటి తరాన్నిమళ్ళీ వెలుగుల వైపు
నడిపించే చైతన్య శక్తి గురువు
మత్తును పారద్రోలే సైనికుడు గురువువిదార్థుల్లోఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ప్రాణదాత గురువు నవ సమాజ నిర్మాత మేథోసామర్ధ్యాలు పెంచుకొనిభారత దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుదాం భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను జగతిన చాటుదాం ఉత్తమ పౌరులుగా ఎదుగుదాం ఉజ్జ్వల భవిష్యత్తుతో విజ్ఞాన భారత్ నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములమై ప్రగతి శీల
ప్రతిభా ఆవిష్కరణలతోభారత్ ను విశ్వ గురువు స్థాయికి చేర్చుదాం.
మీ...
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం,తెలంగాణ ఎడుకేషన్ ఫోరంరచయిత కాలమిస్ట్ కరీంనగర్
ఫోన్ నెంబర్ : 9440245771
