– రన్నింగ్, షార్ట్ ఫుట్, స్పీడ్ వాట్ కింగ్ పోటీలు
– 60లో సైతం 20 వయస్సు ఉన్నట్టుగా పాల్గొన్న క్రీడాకారులు
– 60 వయసులో హ్యాట్రిక్ కొట్టిన వల్లంపల్లి లక్ష్మణ్, వాకిటి అంజయ్య ఆచారిలను అభినందించిన క్రీడాకారులు
నారాయణపేట, సెప్టెంబర్ 5 (జన ఉదయం ప్రతినిధి)
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్బంగా శనివారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని మినీ స్టేడియం గ్రౌండ్లో ఈనాడు లక్ష్య ఆధ్వర్యంలోని నిర్వాహకులు అక్షర పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులైన జగదీష్ కుమార్ ఉపాధ్యాయులకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలు మూడు విభాగాలుగా విభజిస్తూ నిర్వహించడం జరిగింది. 100మీటర్లు, 200మీటర్లు, షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. ఇట్టి పోటీలు 60 వయసు దాటిన వృద్ధులు 20 సంవత్సరాల యువకుల్లాగా రన్నింగ్ లో షార్ట్ ఫోటో స్పీడ్ వాకింగ్ లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇందులో 60 వయస్సు పై గల వారిలో వల్లంపల్లి లక్ష్మణ్ హ్యాట్రిక్ తో ప్రథమ స్థానం సంపాదించగా అదే హెర్క్ తో ద్వితీయ స్థానాన్ని వాకిటి అంజయ్య ఆచారి తృతీయ స్థానాన్ని కర్నే నర్సయ్య టీచర్లు సాధించారు. గెలుపొందిన వారికి నారాయణపేట జిల్లా డివైస్ ఓ వెంకటేష్ వర్లు గుప్తా చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు కోచ్ జగదీశ్ విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా DYSO వెంకటేష్ శెట్టి మాట్లాడుతూ ఎంతో ఉన్నత స్థానంగా భావించినటువంటి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈనాడు లక్ష ఆధ్వర్యంలో నిర్వాహకులు అక్షర పాఠశాల పీఈటి జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎట్టి పోటీలు నిర్వహించడం అభినందనీయం అర్చన ఎం అన్నారు. మక్తల్ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అనునిత్యం మినీ స్టేడియం గ్రౌండ్లో క్రీడాకారులకు మెరుగైన క్రీడా నైపుణ్యతను అందించుటలో జగదీష్ కుమార్ ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిలి శ్రీహరి ఆధ్వర్యంలో మక్తల్ కళాశాల మైదానం మెరుపులు దిద్దుకోబోతుందని క్రీడాకారులకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని డివైస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర క్రీడామంత్రిక ఉంటూ తన నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎంతో తోడ్పాటున అందిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు వాకిడిని చప్పట్లతో క్రీడాకారులందరూ అభినందించారు. ఏది ఏమైనప్పటికీ క్రీడాకారులను ప్రోత్సహించుటలో ఈ ప్రాంతం నుండి నారాయణపేట జిల్లా తరఫున మారుమూల గ్రామంలోని క్రీడాకారులందరినీ వారి ప్రజలను గుర్తిస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్న తనవంతు కృషి చేస్తానంటూ డివైస్ ఓ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఇలాంటి కార్యక్రమం నిరహించిన ఈనాడు లక్ష్య కోచ్ జగదీశ్ గారికి అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు. అలాగే నేడు నిర్వహించిన క్రీడాకారుల పోటీలకు బహుమతులు అందించిన అస్ముద్దీన్ ఈనాడు లక్ష నిర్వాహకులు జగదీశ్వర్ శాలవతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో టీచర్స్ అంజయ్య ఆచారి, రమేష్ రావు, వెంకటేష్, హసనిద్దీన్, నర్స్సయ్య, హన్మంతు, లక్ష్మారెడ్డి , అంబదాస్, కోచ్ జగదీశ్ క్రీడాకారులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
