– నేడు బాలకృష్ణారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయం హర్షనీయం
– మంత్రి డాక్టరు వాకిటి శ్రీహరి
– ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
– నాకు నా కూతురే సేవా మార్గాన్ని చూపింది…
– డాడీ మీరు ఎన్ని చేసినా ఉచిత వైద్యం పేద ప్రజలకు అందించు అన్న మాటలు నన్ను ప్రేరేపితులను చేసింది
– యశోద హాస్పిటల్ బృందం వారి సేవలు అభినందనీయం హర్షనీయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు
– బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత జి బాలకృష్ణారెడ్డి
– ఊట్కూర్ లో బి కే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 900 మందికి పైగా ఉచిత వైద్య సేవలు
– ఉచిత మందులు, కంటి అద్దాల పంపిణీ
నారాయణపేట, సెప్టెంబరు 20 (జన ఉదయం ప్రతినిధి )
మానవుని లోని మంచి తనం ఎప్పుడు బయటపడుతుందంటే తాను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారానే ఈ సమాజానికి ప్రజల ద్వారా చక్కటి గుర్తింపు లభిస్తుందని సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన రావడం ఆ భగవంతుడు ఇచ్చిన వరమని, అలాంటి సేవా కార్యక్రమాలు చేయుట వారిలో అన్న బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయం హర్షనీయం అంటూ కొనియాడారు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టరు వాకిటి శ్రీహరి.
ఆదివారం మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండల కేంద్రంలో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బాలకృష్ణారెడ్డి తో పాటు స్థానిక సర్పంచ్ అన్ని పార్టీల ముఖ్య ప్రధాన నాయకుల తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….ఉట్కూర్‌లో ఇంత పెద్ద స్థాయిలో మెగా హెల్త్ క్యాంపును తొలిసారిగా ఏర్పాటు చేసిన బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు ఉచిత మెగా హెల్త్ క్యాంపులు మొదటగా సంఘం మండ గ్రామంలో రెండవదిగా మక్తల్ పట్టణంలో మూడవదిగా మన ఉట్కూరు మండల కేంద్రంలో బాలకృష్ణారెడ్డి ఏర్పాటు చేయడం మీ అందరి అదృష్టంగా భావించాలని అన్నారు మంత్రి.
సేవ చేసే గుణం కొందరికే ఉంటుందని,మనం చేసిన సేవే మనలను కాపాడుతుందని మంత్రి అన్నారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో తోడ్పాటు అందిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలసిన అవసరం ప్రజలపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ సందర్బంగా పేద పిల్లలకు డిజిటల్ పలకలు, రోగులకు మందులు, దుప్పట్లు, కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు.
నా కూతురే నాకు మార్గదర్శకం…
బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి…
తాను పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమంలో అందిస్తున్నప్పటికీ ఒకానొక సందర్భంలో తన కూతురు వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో డాడీ మీరు ఎన్ని సేవా కార్యక్రమం చేసినప్పటికీ పేద ప్రజలకు వైద్య సేవలు అందించండి అంటూ అన్న మాటలు నా మనసును ఒక్కసారిగా తట్టి లేపిందని అప్పుడే నా మనసులో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన రేకెత్తించిందని బికేఆర్ ఫౌండేషన్ అధినేత జీ బాలకృష్ణారెడ్డి అన్నారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా మిత్రుడైన రాష్ట్ర మంత్రివర్యులు ఎల్లవేళలా వెడ్డినట్టు ఉంటూ తనకు సమాజ సేవ చేసే కార్యక్రమాలను వెన్నుదట్టి ఉండడం నాకు ఎంతో అదృష్టాన్నిస్తుందని బాలకృష్ణారెడ్డి అన్నారు. గతంలో పేద ప్రజలకు తమ బి కే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసిన మొదటి సేవా కార్యక్రమం నన్ను తట్టి లేపడంతో వాటికి నా కూతురు యొక్క ఆలోచన విధానం తోడు కావడం నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందని బాలకృష్ణారెడ్డి అన్నారు. ఇకనుండి అయినా అందరి సహకారం ఉన్నంతకాలం పార్టీలకతీతంగా సేవి పరమావధిగా భావిస్తూ ఇలాంటి పేద ప్రజలకు ఉచిత వైద్య శిరాలను ఏర్పాటు చేస్తూ వారికి సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు నాకు మరింత ఇవ్వాలంటూ బాలకృష్ణ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తను కోరిన వెంబడే యశోద ఆసుపత్రి వారి బృందం గతంలో సంఘం మండ గ్రామంలో మక్తల్ పట్టణంలో ఇప్పుడు ఉట్కూరు మండల కేంద్రంలో తమ యొక్క సేవలు అందించడం అభినందనీయం హర్షనీయం అంటూ కొనియాడారు బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత జి బాలకృష్ణారెడ్డి. ముఖ్యంగా వ్యక్తి యొక్క హెల్త్ క్యాంప్ ఇన్చార్జి అయిన యశోద హాస్పిటల్ డిప్యూటీ మేనేజర్ శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు బాలకృష్ణారెడ్డి.
900 మందికి పైగా ఉచిత వైద్య సేవలు…
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఉట్కూరు మండలంలో కేంద్రంలో ఆదివారం బి కే ఆర్ ఫౌండేషన్ అధినేత జి బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహణలో ఉట్కూరు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ దాదాపు 1000 మందికి దగ్గర ఉచిత వైద్య సేవలు పొందడం జరిగింది. ఇట్టి భాగ్యాన్ని బికేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి కల్పించడం ప్రజలందరూ వ్యక్తం చేశారు. టుడీఈ కో గైనకాలజిస్ట్ జనరల్ కంటి పరీక్షలు బిపి షుగర్ ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరికి వేలాది రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది కానీ అలాంటిదేమీ కాకుండా ఇట్టి సేవలను డీకే ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలకృష్ణారెడ్డి ఉచితంగా పేద ప్రజలకు అందించడం ఎంతో గర్వకారణం అని ప్రజలు అంటున్నారు. వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు కంటి అద్దాలు ఇవ్వడంతో పాటు పేద ప్రజలు కప్పుకోవడానికి దుప్పట్లు సైతం ఉచితంగా ఇవ్వడం అలాగే చిన్న పిల్లలకు అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా వేలాదిగా మల్టీకలర్ డిజిటల్ పలకలను అందించడము ప్రజలందరూ ఎంతగానో బాలకృష్ణారెడ్డిని వారి కుటుంబాన్ని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు బాలకృష్ణారెడ్డి మరిన్ని చేపట్టాలని వారు ఆశాభహవాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు….
ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఉట్కూర్ గ్రామ సర్పంచ్ రేణుక, బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణా రెడ్డి నాయకులు కొండయ్య లక్ష్మారెడ్డి రవికుమార్ సూర్య ప్రకాష్ రెడ్డి యగ్నేశ్వర్ రెడ్డి తో పాటు వివిధ రాజకీయ నాయకులు యశోద ఆసుపత్రి బృందం అయినటువంటి దీప్తి మేనేజర్ శ్రీధర్ మార్కెటింగ్ మేనేజర్ రామాంజనేయులు డాక్టర్ ఉమాదేవి కార్డియాలిస్ట్ డాక్టర్ వీరారెడ్డి కార్డియాలజీ డాక్టర్ నీలోఫర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమేరా ఆర్తో డాక్టర్ సింధు జనరల్ డాక్టర్ సోనీ జనరల్ డాక్టర్ షేక్ జనరల్ ఉమాదేవి కార్డియాలజీ టెక్నీషియన్ దుర్గా మధుర సంతు శశి మమత సాయినాథ్ రాజేష్ గణేష్ రాము తదితరులు పాల్గొన్నారు.
