మక్తల్లో అంగరంగ వైభవంగా వివేకానంద స్వామి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు

• విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నేరడగం , బిజ్వార్ స్వామిజీలు

• స్వామి వివేకానంద భావాలను యువత పునికిపుచ్చుకోవాలి

• రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి

• విద్యార్థులు ఏకాగ్రతతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి

• మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ డీకే అరుణ

• మానవ జీవితంలో ధర్మం కీర్తి ఈ రెండు మాత్రమే స్థిరంగా ఉంటాయి

• నేరడగం పంచమసిద్ద లింగ మహాస్వామి

• భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు మూర్తిమత్వం స్వామి వివేకానంద

• బిజ్వార్ పీఠాధిపతులు ఆదిత్య పరాశ్రీ స్వామీజీ

• భారతదేశ గొప్ప తనాన్ని విశ్వానికి చాటి చెప్పిన గొప్ప మేధావి స్వామి వివేకానంద

• మాచర్ల రాంబాబు (ABVP రాష్ట్ర కార్యదర్శి)

నారాయణపేట, సెప్టెంబర్ 21 (జన ఉదయం ప్రతినిధి )

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మఖ్తల్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

మఖ్తల్ పట్టణ కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషమని భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద యొక్క భావాలను గుణగణాలను శీల స్వభావాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
స్వామి వివేకనంద చెప్పిన ఇనుప కండరాలు ఉక్కు నరాలతో వజ్రతుల్యమైన మనస్సు కలిగిన యువత వల్లే దేశం నిర్మాణం సాధ్యమవుతుందని ఆ దిశగా అందరు ప్రయత్నం చేయాలని కోరారు.

ఎంపీ డీకే అరుణ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఏకాగ్రతతో నేటి నరేంద్రుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచించిన వికసిత భారత్ 2047 లక్ష్యంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.


ఏబీవీపీ రాష్ట్ర నాయకులు రాంబాబు గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆదర్శాలతోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభమైందని నాటి నుండి నేటి వరకు దేశంలో నెలకొన్న ఎన్నో సామాజిక విద్యా సమస్యలపై ఏబీవీపీ నిరంతరంగా పోరాటం చేస్తుందని అలాంటి విద్యార్థి సంఘంతో విద్యార్థి లోకమంతా కలిసి నడవాలని పిలుపునిచ్చారు.

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ అనంతరం సభాధ్యక్షులు అంజిరెడ్డి గారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు.

అనంతరం వివేకానంద విగ్రహ ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలను నిర్వహించిన వారికి బహుమతుల ప్రధానం చేశారు.

అనంతరం స్వామీజీలకు మంత్రివర్యులకు విగ్రహ ప్రతిష్టాపన కమిటీ తరఫున సన్మానం చేశారు.

కార్యక్రమంలో ఏబీవీపీ నగర అధ్యక్షులు అంజిరెడ్డి రాష్ట్ర నాయకులు వినయ్ కుమార్ అగర కార్యదర్శి వంశి సంయుక్త కార్యదర్శి వినయ్ మీడియా ఇంచార్జ్ శరణ్ సందీప్ నవీన ఆనంద్, నాని అక్షయ సుమశ్రీ మాయ సాయి వర్షిని వివిధ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు పత్రిక విలేకరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.