అక్రమ ఇసుక డంపులపై రెవెన్యూ అధికారులకు సూటి ప్రశ్న?

– బ్యాటరీ రాజు బీజేపీ మక్తల్ టౌన్ కార్యదర్శి

నారాయణపేట, సెప్టెంబర్ 20(జన ఉదయం ప్రతినిధి)

నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని నారాయణపేట్ చౌరస్తా నుంచి కాటన్ మిల్ దాటే వరకు రోడ్డుకు కుడివైపు భారీగా ఇసుకను డంప్ చేసి ఉంచిన విషయం ప్రజల కళ్లముందే ఉంది. అక్కడ సుమారు 100 టిప్పర్ల ఇసుక నిల్వ ఉన్నట్లు కనిపిస్తోంది. దీని విలువ లక్షల రూపాయల్లో ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారని ఇట్టి అక్రమ ఇసుక డంపులపై సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులకు ఇట్టి ఇసుకకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇట్ ఇసుక ఎలా వచ్చింది అన్న వాటిపై సూటిగా ప్రశ్నిస్తున్నానని మక్తల్ టౌన్ బిజెపి కార్యదర్శి బ్యాటరీ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రెవెన్యూ అధికారులకు సూటి ప్రశ్న:

ఇంత పెద్ద మొత్తంలో ఇసుకను ఒకే ప్రాంతంలో డంప్ చేసి ఉంచితే అధికారుల దృష్టికి ఎందుకు రావడం లేదు అని రాజు ప్రశ్నిస్తున్నారు ? ఎవరి అనుమతితో ఇంత ఇసుకను డంప్ చేశారు? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సక్రమంగా వస్తుందా? లేక ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా అని ఆయన పేర్కొన్నారు?
బ్యాటరీ రాజు, బీజేపీ మక్తల్ టౌన్ కార్యదర్శిగా ఈ విషయంపై గతంలో మక్తల్ MROతో, మాగనూరు MROతో, కృష్ణ MROతో కూడా అక్రమ ఇసుకను రాత్రింబవళ్లు తరలిస్తున్న విషయంపై మాట్లాడాను, అయినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం లేదు ఎందుకు అన్నారు?

ఇదే సమయంలో ఇటీవల వారం, పది రోజులుగా గార్లపల్లి రోడ్డు వైపు వ్యవసాయ భూముల మధ్య నుంచి, రైల్వే ట్రాక్ పక్కనుగా అక్రమంగా ఇసుక టిప్పర్లు రాత్రింబవళ్లు తిరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. మక్తల్ MRO, మక్తల్ ఎస్సై, సంబంధిత పోలీస్ శాఖ అధికారులు వెంటనే ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాటరీ రాజుగా డిమాండ్ చేస్తున్నాను అంటూ తెలిపారు.

ఒక్క రూట్‌లోనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఇసుక డంపులు బయటపడుతున్నప్పుడు, మక్తల్ పట్టణం మొత్తంలో ఇలాంటి అక్రమ ఇసుక డంపులు ఇంకా ఎన్ని ఉన్నాయో అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందన్నారు . మక్తల్ MRO వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమంగా డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసి, ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా ఇసుక డంప్ చేస్తున్న వారిపై, సంబంధిత ఇసుక మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ తెలిపారు.

ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీ నాయకులకు సూటి ప్రశ్న?

మన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో, మన పట్టణంలో ప్రజల కళ్లముందే ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు మీ దృష్టికి రావడం లేదా? తెలిసిన తర్వాత కూడా ఎందుకు వెంటనే అధికారులను ఆదేశించి తనిఖీలు చేయించడం లేదు అంటూ ప్రశ్నించారు?
జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి, అక్రమంగా డంప్ చేసిన ఇసుకను తనిఖీ చేసి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత తమరిపై ఉందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదాయం తగ్గించే అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ ఆదాయం పెరిగేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని బ్యాటరీ రాదు డిమాండ్ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.