ప్రతి రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం కల్పించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి

— జిల్లా కలెక్టర్ ప్రియాంక.

నారాయణపేట, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి)

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా, స్థిరమైన ఆదాయ వనరులను కల్పించే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో డ్రాట్ మిటిగేషన్ ( కరువు నివారణ) పై జిల్లా కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో డ్రాట్ మిటిగేషన్ కార్యక్రమంలో భాగంగా నారాయణ పేట జిల్లా లోని ఉట్కూర్ మండలాన్ని ఎంపిక చేయగా దానిని అమలు చేసే బాధ్యతను వాసన్ సంస్థ చేపట్టగా సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాసన్ సంస్థ ప్రతినిధులు డీ పీ ఆర్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ..
గ్రామీణ కుటుంబాల అవసరాలు, స్థానిక వనరులు, రైతుల సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని ఒకే సమగ్ర ప్రణాళిక కింద వివిధ కార్యక్రమాలను అనుసంధానం చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులను చిన్నచిన్న కార్యక్రమాలుగా విభజించడం కంటే, ఎక్కువ మంది రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే ఒక ప్రధాన ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని తెలిపారు.
వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, పౌల్ట్రీ, డెయిరీ, గొర్రెలు, మేకల పెంపకం తదితర లైవ్‌స్టాక్ రంగాలను ప్రణాళికలో భాగం చేయాలని సూచించారు. ముఖ్యంగా పౌల్ట్రీ, లైవ్‌స్టాక్ రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్, సాంకేతిక సహాయం, శిక్షణ, వెటర్నరీ సేవలు, మార్కెట్ లింకేజీ అందేలా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
ఒక్కో చోట ఒక యూనిట్ ఏర్పాటు చేసి వదిలేయకుండా, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి విలువ గొలుసు అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు, ఇన్‌పుట్స్, ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలను సమన్వయం చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీని కేవలం సహజ వనరుల నిర్వహణ (NRM) కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి కుటుంబం యొక్క ఆదాయం, ఆహార భద్రత, వ్యవసాయం, పశుసంపద, ఎంటర్‌ప్రైజెస్, ఉపాధి అవకాశాలను అనుసంధానం చేసే వేదికగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి కుటుంబానికి వారి అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా తగిన ఎంటర్‌ప్రైజ్‌ను గుర్తించి, ఆర్థిక సంస్థలు, సంబంధిత శాఖలు, మార్కెట్ సంస్థల సహకారంతో అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ఇప్పటికే ఉన్న ఎఫ్ పీ వో లను బలోపేతం చేయాలని,
ప్రతి ప్రాంతంలో కొత్త రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (FPO) ఏర్పాటు చేయడం కంటే, ఇప్పటికే సమర్థవంతంగా పనిచేస్తున్న ఎఫ్ పీ వో లను గుర్తించి వాటిని మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు.
అవసరం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొత్త ఎఫ్ పీ వో లను ఏర్పాటు చేసి, వాటికి ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్, వర్కింగ్ క్యాపిటల్, సాంకేతిక సహాయం వంటి అంశాల్లో అవసరమైన సహకారం అందించాలని తెలిపారు.
ప్రతి ప్రణాళిక ఆర్థికంగా సాధ్యమైనది, దీర్ఘకాలికంగా నిలకడైనది, కుటుంబానికి ఆదాయం సమకూర్చే విధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రణాళిక రూపొందించే సమయంలో పెట్టుబడి, ఆదాయ అవకాశాలు, మార్కెట్, నిర్వహణ వ్యయం, కుటుంబానికి కలిగే ప్రయోజనం వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
“ఒక గ్రామం–ఒక సమగ్ర ప్రణాళిక–ప్రతి కుటుంబానికి ప్రయోజనం–స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.
ప్రతి ప్రణాళిక ఆర్థికంగా సాధ్యమైనది, దీర్ఘకాలికంగా నిలకడైనది, కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందించే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి/ కార్యక్రమ నోడల్ అధికారి సక్రియా నాయక్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్, వాసన్ సంస్థ ప్రతినిధులు అనిల్ ఉప్పల పాటి, బక్కారెడ్డి, లక్ష్మణ్, మండల వ్యవసాయ శాఖ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.