– మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలి
– ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం
నారాయణపేట, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి)
నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వాసవి సాయి నగర్ కాలనీలో గల శ్రీ షిరిడి బాబా దేవాలయ ప్రాంగణంలో ఈనెల 8వ తేదీ మంగళవారం రోజు లలిత సహస్ర నామావళి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు గణేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కుంకుమార్చన కార్యక్రమం మహిళా భక్తులచే నిర్వహించబడుతుంది కావున మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. కుంకుమార్చన కార్యక్రమం అనంతరం మధ్యాహ్న హారతి ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.
ఇట్టి విశేష ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తులు అమ్మవారి ఆ సాయినాధునిక కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు.
