నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

– నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలి

– రాష్ట్ర మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాల నాయకులు

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జన ఉదయం బ్యూరో)

గత నెలలో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ బోయా అరవింద్, బోయ విజయ్ అనే నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత అమానవీయంగా గుర్తుతెలియని ఆయుధంతో శరీర భాగాలను కోయడంతో 20 కుట్ల దాకా పడి దాదాపు పది రోజులకు పైగా ఆసుపత్రిలో మహిళ చికిత్స పొందిన పరిస్థితి నెలకొని ఉన్నది. తరువాతి క్రమంలో బాధిత మహిళతో ప్రజాసంఘాల నాయకులు మాట్లాడి జరిగిన విషయాలను తెలుసుకున్న తర్వాత బాధిత మహిళ చెప్పిన విషయాలకు, ఫిర్యాదు నమోదు పత్రంలో చేర్చిన విషయాలకు చాలా తేడాలు ఉన్నాయి… దీనిపై అనుమానాలు ఉండటంతో నిందితులపై సామూహిక అత్యాచారం కేసు మాత్రమే నమోదు చేసి రాజకీయా ప్రలోభాలకు గురై విచారణ నిష్పక్షపాతంగా జరగడంలేదనే విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రక్తపు గాయాలు అయిన విషయంపై విచారణ చేసి నిందితులపై హత్యాయత్నం కేసును కూడా నమోదు చేయాలని కమిషన్ కు వివరించడం జరిగింది. అలాగే ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఆయనను ఎందుకు తప్పించారో కూడా విచారించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
ముఖ్యంగా మహిళకు సొంతగృహం తో పాటు పింఛన్ మంజూరు చేసి బాధిత మహిళలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేయాలని, తన మైనర్ బాలుడికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని వివరించడం జరిగింది.
దాదాపు మొత్తం కమిషన్ సభ్యులతో కూడుకున్న బృందంతో గంటన్నరకు పైగా ఈ విషయాలపై చర్చించడం జరిగింది. క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ సభ్యులు మరియు కార్యదర్శి గారు మహిళకు న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని అలాగే పై విషయాలపై అధికారుల వివరణ కోరుతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి.చంద్రశేఖర్ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, కే.పృథ్వీరాజ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు,మద్దిలేటి మానవ హక్కుల కార్యకర్త, పులి కల్పన దళిత బహుజన ఫ్రంట్ కార్యదర్శి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.