– 16వ వార్డులో పనుల పరిశీలన
– వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని
నారాయణపేట, సెప్టెంబర్ 10 (జన ఉదయం ప్రతినిధి)
ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో బుధవారం డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కురి పావని ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు కమిషనర్ రాజయ్య, ఏఈ నాగ శివ పనులు ప్రారంభించి స్వయంగా పర్యవేక్షించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ…
సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డులలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు చేపట్టి ఎలాంటి వారికి ఇతర ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఇటీవలే అన్ని వార్డులలో సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని దీంతోపాటు పైప్లైన్ పనులు డ్రైనేజీ ఇతర పనులు సైతం చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వాకిటి శ్రీహరి గారు శ్రీకారం చుట్టుబోతున్నారని మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పారిశుద్ధ మున్సిపల్ అధికారి దేవదాస్, టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు రహీం పటేల్, కర్రెమ్ మహేష్ , సరిత గోవిందరావు, కలాల్ శ్రీవిద్య నీల గౌడ్ , మంజూరు ఇలాహి , శంకర్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ శాలంబిన్ ఉమర్ ,కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్ , శంషుద్దీన్ , ఉషాముద్దీన్ , స్థానిక నాయకులు కే.జగదీష్, మహీబలి , నవీద్ పాషా , చిట్యాలనవీద్ తదితరులు పాల్గొన్నారు.
