– గుండె, కీళ్ల సమస్యల లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
– తొలిదశలో గుర్తిస్తే ఆరోగ్య సమస్యలకు సకాలంలో చికిత్స
– ఛాతినొప్పి నుంచి కాళ్ల వాపు వరకు.. ప్రతి లక్షణంపై అప్రమత్తత అవసరం
– డాక్టర్ మణికంఠ గౌడ్ మణికంఠ ఆసుపత్రి మక్తల్
నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి)
17సెప్టెంబర్ గురువారం ఉదయం 11 గంటలకు మక్తల్ లోని రాయచూరు రోడ్ లో గల మణికంఠ హాస్పటల్ లో నరాలకు సంబందించిన “న్యూరోలాజిస్ట్”
గుండె సంబంధిత “కార్డి్యోలాజిస్ట్ “మరియు ఎముకలు సంబంధిత “ఆర్థోపెడిక్” డాక్టర్లు అందుబాటులో ఉంటారని
డాక్టర్ మణికంఠ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మణికంఠ ఆసుపత్రి, మక్తల్‌కు చెందిన డా. మణికంఠ గౌడ్ సూచించారు. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, అవి పునరావృతమైతే సకాలంలో వైద్యులను సంప్రదించాలని తెలిపారు. వ్యాధులను తొలిదశలోనే గుర్తించి తగిన వైద్యం పొందడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఛాతినొప్పి, శ్వాస సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు…
ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తల తిరగడం, కాళ్లలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని డా. మణికంఠ గౌడ్ సూచించారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన లక్షణాలను తేలికగా తీసుకోకుండా వైద్యుల సలహా పొందాలని తెలిపారు. అవసరమైన పరీక్షలు చేయించుకుని సమస్యకు అనుగుణంగా చికిత్స తీసుకోవడం ముఖ్యమన్నారు.
కీళ్ల నొప్పులు, కదలికల్లో ఇబ్బందిపైనా శ్రద్ధ
కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, కీళ్లలో వాపు, కదలడంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం వంటి లక్షణాలు ఉన్నవారు కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. సమస్యకు కారణాన్ని గుర్తించి తగిన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చన్నారు.
ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు అవసరం
ప్రతి ఒక్కరూ తమ శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనిస్తూ ఉండాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహా తీసుకోవాలని డా. మణికంఠ గౌడ్ సూచించారు. “లక్షణాలను తొలిదశలో గుర్తించడం ప్రాణాలను కాపాడటంలో కీలకం” అని తెలిపారు.
మణికంఠ ఆసుపత్రి, మక్తల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన వైద్య సలహాలు, ఆరోగ్య సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ పేర్కొన్నారు. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ : 9866841185
