ఘనంగా ప్రారంభ మైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్

– 14,17,19 సంవత్సరాల లోపు బాల బాలికలకు 5 కి.మీ రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలు

– పోటీలను జెండ ఊపి ప్రారంభించిన అధికారులు బి.గోపాలం, వెంకటేష్ శెట్టి, డాక్టర్ మణికంఠ గౌడ్. శ్రీనివాస్ రెడ్డిలు

నారాయణపేట, అక్టోబర్ 10(జన ఉదయం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఆదేశాల మేరకు ,నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో శనివారం మక్తల్ లోని ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో నిర్వహించిన , ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ 14,17,19 సంవత్సరాల లోపు బాల బాలికలకు 5 కి.మీ రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలను ప్రారంభించారు. ఇట్టి పోటీలను జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, జిల్లా క్రీడల అధికారి వెంకటేష్ శెట్టి , డాక్టర్ మణికంఠ గౌడ్. జిల్లా స్కూల్ గేప్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి ఊపి ప్రారంభించారు.
ఈ సైకిల్ పోటీలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి 126 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో క్రీడా ప్రతిభను చాటిన సైకిల్ రైడర్స్ ఎంపిక చేసి ఈ నెల చివరి వారంలో సిద్దిపేటలో జరుగు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సైకిల్ పోటీలకు పంపుతామని బి.గోపాలం తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు….

శివ ప్రసాద్, పీడీలు, పీఈటీలు, రేణుక, స్వప్న, అమ్రేష్ ,దామోదర్, రాఘవేందర్, త్రివేణి, షాబుద్దీన్, తల్లిదండ్రులు, నీలిగిరి కురువ బుడ్డప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.