• అక్టోబర్ 11 నుంచి 20 వరకు అమ్మవారి ఉత్సవాలు..
• ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు పూజా కార్యక్రమాలు
• అక్టోబర్ 11 నుంచి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలు
• పది రోజులపాటు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న వినాయక్ నగర్
• 18 శక్తిపీఠాల విశిష్టతతో శరన్నవరాత్రి వేడుకలు
• అమ్మవారి ఉత్సవాలకు భక్తులకు ఆలయ కమిటీ ఆహ్వానం
• మహాసాద్వి శివశరణి నీలమ్మ, శ్రీ రుషముని పండిత శ్రీ తిప్పయ్య స్వామీజీ దంపతులు
నారాయణపేట, అక్టోబర్ 10(జన ఉదయం ప్రతినిధి)
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని వినాయక్ నగర్లో గల శ్రీ శ్రీ శ్రీ సుక్షేత్ర శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నియు చేసినట్లు ఆలయ అర్చకులు శివమణి నీలమ్మ శివ తిప్పయ్య స్వామీజీలు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం అర్చకులు తిప్పయ్య స్వామి మాట్లాడుతూ అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజులపాటు అమ్మవారి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అక్టోబర్ 11
20వ తేదీ వరకు ఉత్సవాలు…
అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీ మంగళవారం వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అమ్మవారి ఆరాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోస్టర్లో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
18 శక్తిపీఠాల విశిష్టతకు ప్రాధాన్యం…
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 18 శక్తిపీఠాల విశిష్టతను తెలియజేస్తూ అమ్మవారి ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాలు, అమ్మవారి వివిధ రూపాల మహిమను స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ప్రార్థించనున్నట్లు తిప్పయ్య స్వామి తెలిపారు .
ప్రత్యేక పూజలు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు….
ఉత్సవాల సందర్భంగా పూజా కార్యక్రమాలు, అమ్మవారి సేవలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా నిర్వాహకులు కార్యక్రమాలను రూపొందించారు. ఉత్సవాల రోజుల్లో ఆలయానికి విచ్చేసే భక్తులు పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
18 శక్తిపీఠాల అమ్మవార్ల పేర్లు….
లంకామి శాంకరి దేవి
అలంపూర్ జోగులాంబ దేవి
ఉజ్జయిని మహాకాళి దేవి
హరిక్షేత్ర కామరూపా దేవి
వారణాసి విశాలాక్షి దేవి
కంచి కామాక్షి దేవి
శ్రీశైల భ్రమరాంబికా దేవి
పిఠికామి పురుహూతికా దేవి
ప్రయాగ మాధవేశ్వరం దేవి
కాష్మ రౌతు సరస్వతి దేవి
ప్రద్యుమ్న శృంఖలాదేవి
కొల్హాపుర మహాలక్ష్మి దేవి
పద్మాణి గిరిజా దేవి
జ్వాలాయ వైష్ణవి దేవి
చాముండేశ్వరి దేవి
మహోరై ఏకవీరికా దేవి
దాక్షారామ మాణిక్యంబదేవి
గయ మంగళ్య గౌరి దేవి
నిత్య దేవి పూజా సేవా భక్తుల వివరాలు…
శ్రీమతి, శ్రీ ఉషా రమేష్ మిఠాయి
మక్తల్ శ్రీమతి, శ్రీ బాల్చేడు పాపని మల్లికార్జున్, మాజీ మున్సిపల్ చైర్మన్
శ్రీమతి, శ్రీ సుజాత అశోక్
శ్రీమతి, శ్రీ మేఘున ప్రదీప్ కుమార్
శ్రీమతి, శ్రీ బాల్చేడు జయంతి శివరాజ్
శ్రీమతి, శ్రీ అనూష సత్యనారాయణచార్య
శ్రీమతి, శ్రీ కోళ్ళ పద్మమ్మ చిన్న నర్సింహులు
శ్రీమతి, శ్రీ శైలజా జగదీష్ కుమార్
కుమారి రాములక్ష్మి
కుమారి చిన్న రాఘవమ్మ
శ్రీమతి, శ్రీ సంద్యా అమ్రేష్
శ్రీమతి, శ్రీ వనజ శివారెడ్డి
శ్రీమతి, శ్రీ శివమ్మ చిన్న అంజప్ప
శ్రీమతి, శ్రీ విజయలక్ష్మి వెంకటేష్
శ్రీమతి, శ్రీ సవిత శ్రీధర్ రావు
శ్రీమతి, శ్రీ కె. పూజిత జగదీష్
రుద్రాక్ష ఏజెన్సీ
సునీల్ ఐస్ క్రీమ్
మక్తల్ శ్రీమతి, శ్రీ అనురాధ శ్రీనివాస్ రావు
శ్రీమతి, శ్రీ మొగిలి అమ్మ శేఖర్
శ్రీమతి, శ్రీ పవిత్ర మహేష్ సాగర్
శ్రీమతి, శ్రీ బసమ్మ కృష్ణప్ప
శ్రీమతి, శ్రీ పాండురంగమ్మ నర్సింహులు
దేవాలయ కమిటీ సహకారం మరియు భక్త సహకారంతో కార్యక్రమాలు జరుపబడును అంటూ తెలిపారు శివమణి నీలమ్మ తిప్పయ్య స్వామీజీలు.
అక్టోబర్ 16 నుంచి 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు….
అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటల ఐదు నిమిషాలకు కుంకుమార్చన , 17వ తేదీ శనివారం రాత్రి 7:15 నిమిషాలకు సమస్త విద్యార్థి బృందం చే సరస్వతి పూజ , 19వ తేదీ సోమవారం అమ్మవార్ల అలంకరణ ప్రదర్శన చిన్న పిల్లలతో, 20వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు రథోత్సవ కార్యక్రమం జమ్మి వృక్ష పూజ శ్రీ ఆదిశక్తి పురాణ ప్రవచనం ముగింపు మహా మంగళహారతి తీర్థప్రసాదాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆహ్వానం…
శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు, స్థానిక ప్రజలు సహకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించుకోవాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వేదిక: శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, వినాయక్ నగర్, మక్తల్, నారాయణపేట జిల్లా.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 8639243116.
