Viral News: కొలంబియాలోని మెడెల్లిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి వచ్చిన ఓ విమానంలో దిగిన నలుగురు వ్యక్తుల ప్రవర్తనపై ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమానం కలగడంతో, వారిని పక్కకు తీసుకెళ్లి చెక్ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
Viral News: యూఎస్ నుంచి మెడెల్లిన్ చేరిన అనంతరం, ప్రతి ప్రయాణికుడి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కొనసాగగా, ఈ నలుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి లగేజిని స్కాన్ చేయగా, ఒకరి బ్యాగ్‌లో ఏకంగా 100 కండోమ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. అధికారులు కారణం అడిగినా, వారి సమాధానాలు పొంతనలేని విధంగా ఉండటంతో అనుమానం మరింత గాఢమైంది.
వారిని కస్టడీకి తీసుకున్న అధికారులు, ఈ నలుగురూ అమెరికా దేశస్థులని గుర్తించారు. లైంగిక పర్యాటక ఉద్దేశ్యంతో కొలంబియాకు వచ్చినట్టుగా ప్రారంభ విచారణలో అనుమానిస్తున్నారు. అనంతరం ముగ్గురు వ్యక్తులను పనామా సిటీకీ, మరోవ్యక్తిని మయామికి తిరిగి పంపినట్టు సమాచారం.
కొలంబియా ఇమ్మిగ్రేషన్ అధికారులు మాట్లాడుతూ, “ఆంటియోక్వియా ప్రాంతంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలను మరింత బలోపేతం చేశాం. లైంగిక పర్యాటకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం” అని వెల్లడించారు. 2024 నుంచీ ఇప్పటివరకు సుమారు 102 మందికి ఎంట్రీ బ్యాన్ విధించినట్టు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఇప్పటిదాకా 70 మంది అనుమానిత లైంగిక పర్యాటకులను దేశంలోకి అనుమతించలేదని సమాచారం. వీరిలో అధిక సంఖ్యలో అమెరికా పౌరులే ఉండటం ప్రత్యేకంగా గమనార్హం.
