గుర్లపల్లి రోడ్ లో నిర్మించిన సిసి రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

• టర్మ్ ముగిసేలోగా ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ..

• 173 కోట్లతో బీటీ రోడ్లు, బ్రిడ్జి పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క

• 25 కోట్లతో 3 మున్సిపాలిటీ లలో సీసీ రోడ్లు ..

• గుర్లపల్లి రోడ్ లో నిర్మించిన సిసి రోడ్డు పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

• ప్రతి గ్రామానికి రోడ్డు వేశాకే ఎన్నికలకు వెళ్తానని తేల్చి చెప్పిన ప్రజల మనిషి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి …

నారాయణపేట, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)

మత్తు వదలండి నిజం తెలుసుకోండి అనే కార్యక్రమంలో భాగంగా… మక్తల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షతన శుక్రవారం పట్టణంలోని గుర్లపల్లి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు శుక్రవారం అభివృద్ధి పనులను వివరించారు. బీఆర్ఎస్ నాయకులు మక్తల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని.. మత్తు వదులుకొని తెలుసుకోవాలని సూచించారు.
రూ.173 కోట్లతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు, గ్రామాల మధ్యన పలుచోట్ల బ్రిడ్జిల పనులు ఇటీవల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు ప్రారంభించారని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు రూ.25 కోట్లతో మూడు మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున సిసి రోడ్లు వేస్తున్న సంగతి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని తేల్చి చెప్పారు. మరో వంద కోట్లు తీసుకువచ్చి రోడ్లకు నిధులు కేటాయించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి చర్యలు చేపట్టారని తెలిపారు.
మక్తల్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్నదే మంత్రి వాకిటి శ్రీహరి ధ్యేయమని, ఎన్నికల లోపు ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేసి.. నియోజకవర్గంలో రోడ్లు లేని గ్రామం ఉండకుండా చేసి.. అప్పుడే ఎన్నికలకు వెళ్తానని మంత్రి వాకిటి శ్రీహరి తేల్చి చెప్పిన సంగతిని గుర్తు చేశారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో గ్రామాలకు రోడ్లు వేసే పరిస్థితి లేదని, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో వెల్లువలా గ్రామాలకు రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్న సంగతిని మత్తు వదులుకొని కళ్ళు తెరిచి నిజం తెలుసుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, సీనియర్ నాయకులు కట్ట సురేష్ గుప్తా, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్,మున్సిపల్ టౌన్ కౌన్సిలర్లు రహీం పటేల్ ,వెంకటేష్, కలాల్ శ్రీవిద్య నీల గౌడ్ మంజూరు ఇలాహి, గోవింద్ రావ్, శంకర్, , సాయి ఫైనాన్స్ శీను, కోఆప్షన్ సభ్యులు శంషుద్దీన్, మహమ్మద్ ఇసాక్, కల్లూరి గోవర్ధన్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి భాస్కర్, బ్యాగరి సురేష్, NSUI. నాయకులు మహమ్మద్ నవీద్ పాషా, నాదర్, ఖలీల్, మహమ్మద్ రఫ్, ఫిరోజ్, హాజీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.