అలరించిన శ్రీకృష్ణ స్వామి పాలవుట్ల కార్యక్రమం

– కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి

– వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

– ఉట్లు కొట్టిన వారిని అభినందిస్తూ సన్మానించిన మంత్రి వాకిటి శ్రీహరి

– ఆలయ అభివృద్ధికై లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన ఉందెకోడ్ రవికుమార్

నారాయణపేట, సెప్టెంబర్ 5 (జన ఉదయం ప్రతినిధి)

శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మక్తల్ పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉట్ల ఉత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని, భక్తులు, ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

ఆనంద డోలికలో భక్తులు….

పాలవుట్లు కొట్టే సందర్భంలో కురుమ యాదవులు ఆ యొక్క స్తంభాన్ని ఎక్కుతూ క్రిందకు జారుతూ మళ్లీ స్తంభాన్ని ఎక్కుతున్న సందర్భంలో భక్తులు వాటి ఉత్సవాన్ని చూసి ఎంతగానో తిలకించారు. దాదాపు 8 10 సార్లు కురుమ యాదవులు పాలవుట్ల స్తంభాన్ని ఎక్కుతూ కింద పడడం ఎక్కడ కింద పడిన వంటి జరగడంతో చివరికి ఒక పద్ధతి ప్రకారం గా ముందుగా నలుగురు ఆ తర్వాత ముగ్గురు ఆ తర్వాత ఇద్దరు ఒక్కరు ఈ కోణాల్లో కురుమ యాదవులు పాలవుట్ల స్తంభానికి ఓట్లు కొట్టారు.

పట్టణ పురవీధుల గుండా ఘనంగా పిల్లక సేవ…

మక్తల్ పట్టణంలోని యాదవుల వీధిలో పాలవుట్ల అనంతరం ఆ స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని పట్టణ పురవీధుల గుండా ఆలయ భజన మండలి భక్తులు భారీగా ఊరేగిస్తూ భజనలు భక్తిపారవసింగా చేయడం జరిగింది.

ఆలయానికి లక్ష రూపాయల విరాళం…

మొక్కలు పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికై మక్తల్ పట్టణానికి చెందిన కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు వందేకోటి రవికుమార్ లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిడి శ్రీహరి చేతుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందించడం జరిగింది.
ఇట్టి వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా మక్తల్ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

గట్టి పోలీసు బంధవస్తు…

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మక్తల్ పట్టణంలో యాదవ్ వీధిలో నిర్వహించినటువంటి పాలవుట్ల కార్యక్రమంలో వీరాంతమంది భక్తులు పాలవుట కార్యక్రమాన్ని తిలకించడానికీ రావడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఐ రామలాల్ ఎస్సై రాజులు గట్టి పోలీసు బందొబస్తూ ఏర్పాటు చేశారు. ఓట్లు కొట్టేందుకై యాదవులు ఒక గ్రూపు వాళ్ళు స్తంభాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సమన్వయ లోపంతో కొంత తోపులాట జరగడంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసు వారు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అందరిని శాంతింప చేశారు. ఇట్టి కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు బిజెపి నాయకులు కొండయ్య, వార్డు కౌన్సిలర్ పీకే నరసింహ  బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ రాములు తిరుపతి నరసింహులు కట్ట సురేష్ కుమార్ గుప్తా  కావలి శ్రీహరి కోళ్ల వెంకటేష్  కర్నే గోపి మామిడిల కిష్టప్ప బుజ్జప్ప వాసవి రాము బుగ్గప్ప గోపాల స్వామి భజన మండలి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.