హైదరాబాద్, సెప్టెంబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)
యువతర మా మేలుకో
నీ ఆలోచనలే దేశానికి
వెలుగు బాటలు
సందిగ్ధాల సంకెళ్లను తెంచుకో
సరికొత్త చరిత్ర ను సృష్టించి
చూపించు
ప్రతికూల ఆలోచనలు
ప్రగతికి శాపాలు
ప్రగతి శీల భావాలే
విజయ సోపానాలు
ఓటములకు లొంగి పోతే
లభించదు గమ్యం
పోరాడే గుణమే
యువతకు అసలైన
సైన్యం
నిరాశే నిన్ను ఆవహించిన
వేళ నీలోని సంకల్పమే
ఒక అగ్ని జ్వాల
సరిహద్దులు దాటి దూసుకుపో
ముందుకు అసాధ్యం లేదులే
నీ మనసులో నర నరాన
లక్ష్యసాధన కాంక్ష నిగుడమై ఉంది
లక్ష్య సాధనకై సాగాలి నీ అడుగు
నీవే రేపటి తరం వెలుగు
సృజనాత్మకత శబ్దమై గర్జించు
ఆత్మనిర్భరతకు సారధివై సాగిపో
ప్రగతి శిఖరాగ్రాన నీజెండాను
ఎగిరేయి
యువత తలిస్తే మారినది ఏదీ
లేదు. నీ ప్రగతిశీల ఆలోచనే
నవ సమాజానికి పునాది.
నేదునూరి కనకయ్య
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771
