చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన గోడపత్రిక విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, సెప్టెంబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ పట్టణంలో ఈ నెల 10 వ తారీఖున ఏర్పాటు చేయనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి చేతుల మీదుగా తన క్యాంపు కార్యాలయంలో రజక సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరింప చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆమె ఆశయాలను స్మరించుకుంటూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు చాకలి ఐలమ్మ వారసులు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
