వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వారోత్సవాలు

• వాసవి మాత అమ్మవారి సన్నిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఘన సన్మానం

• వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు అమోఘం, అద్భుతమైన పాత్రికేయులు

• అమ్మవారి ఆశీస్సులతో వాసవి వనిత క్లబ్ సేవ కార్యక్రమంలో మరింత ముందడుగు వేయాలని ఆకాంక్షించిన పాత్రికేయులు

నారాయణపేట, సెప్టెంబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)

కేసి గుప్త జన్మదిన వేడుకలు,వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా ఆరవ రోజు అయినా ఆదివారం మక్తల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి అమ్మవారి సన్నిధిలో పాత్రికేయులకు ఘనంగా సన్మానించి, పాత్రికేయుల పాశుపతాత్రమైన పెన్నును బహుకరించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య సార్ మాట్లాడుతూ.. వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారని, అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటూ వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమంలో చేయుటకు ఆ అమ్మవారు మీకు శక్తిని ఇవ్వాలంటూ ఆశాభవాని వ్యక్తం చేశారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు నరహరి మాట్లాడుతూ మా మిత్రులు పాత్రికేయులు నాకు ఎప్పుడూ వారి సహకారం ఉందని , వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా పేపర్ కవరేజ్ చేసి వాసవి క్లబ్ మక్తల్ లో చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నాయని వారు వారి పత్రికల ద్వారా ప్రచురించడం చాలా ఆనందంగా ఉందని, ఎప్పుడూ కూడా వారి సహకారం నాకు ఉండాలని, వారి ద్వారా ఉంటుందని నమ్మకం ఉందని, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ క్రీడలలో భాగంగా వాసవి సభ్యులకు పరుగు పందెం పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వాసవి క్లబ్ ట్రెజరర్ మనసాని నాగరాజ్,వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ, పృథ్వీరాజ్, అంజయ్య చారి, కార్తీక్ వెంకట్ రెడ్డి, వాసవి క్లబ్ పెద్దలు కల్వ శ్రీనివాస్, దొంత నరహరి, బిలకంటి నర్సయ్య, బిలకంటి జగదీశ్, బి. భాస్కర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.