– నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
మహబూబ్నగర్, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి)
అక్షరం ఒకటే చీకట్లో వెలుగు తెస్తుంది .అజ్ఞానం నుండి ఙ్ఞానం నింపుతుంది. బానిసత్వంలో స్వేచ్ఛను ఊపిరిని పీల్చుకునేలా చేస్తుంది. 1966లో యునెస్కో ప్రకటించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2026 వరకు చేరుకొని సరిగ్గా 60 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా యునెస్కో నిర్దేశించిన నేపథ్యం *ప్రజలకు భూగోళానికి అభ్యున్నతికి అక్షరాస్యత*
కేవలం పాఠ్యపుస్తక నినాదం కాదు. అది నేటి మానవాళి ఎదుర్కొంటున్నది పెద్ద సవాళ్లకు పరిష్కారం.
ప్రపంచం అక్షరాస్యత…
ప్రపంచంలో ఇంకా 739 మిలియన్ల మందికి అక్షరాస్యత లేదు. భారతదేశంలో 80.9% సగటు అక్షరాస్యత ఉన్న 22 శాతంపై ప్రజలు ఇంకా నిరక్షరాస్యులుగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 72.6%తో దేశంలోని అడుగున తెలంగాణ 76.9 శాతంతో జాతీయ సగటు కంటే వెనుకబడి ఉండటం ఆలోచించ వలసిన అంశాలు.
అక్షరాస్యత మనిషిని మహోన్నతుణ్ని చేస్తుంది….
అక్షరం చదువు నేర్పుతుంది. చదువు సంస్కారం ఇస్తుంది.
మనిషిని మహోన్నతుడిగా తీర్చి
దిద్దుతుంది.
అక్షరాస్యత చీకట్లను పారదోలును…
సమాజంలోఅజ్ఞానమనే చీకట్లను పారదోలి చైతన్యమనే వెలుగును నింపే శక్తి ఒక్క అక్షరానికే ఉంది.
అక్షరాస్యత అనేది కేవలం ఒక వ్యక్తి చదవడం రాయడం నేర్పించడం మాత్రమే కాదు. అక్షరాస్యత మనిషికి స్వేచ్ఛను ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో గౌరవంగా జీవించే హక్కును ప్రసాదిస్తుంది.
అందరికీ విద్యను అందించాలి….
- ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే సంకల్పంతో యునెస్కో (UNESCO) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తుంది. సమాజ అభివృద్ధికి విద్య అవసరాన్ని ప్రాధాన్యతను గుర్తు చేసే రోజు.
విద్య అక్షరాస్యత మీద ప్రముఖ విద్యావేత్తల వ్యాఖ్యానాలు…
విద్య అక్షరాస్యత ఉద్యోగ ప్రాముఖ్యత వివారిస్తూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యావేత్తలు చెప్పిన మాటలు
ఇప్పటికీ అనుసరణీయం.
మార్పుకు ఆయుధం…
ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తి వంతమైన ఆయుధం విద్య.
__నెల్సన్ మండేలా _
(ప్రముఖ విద్యా హక్కుల సమర్థకుడు నోబుల్ ప్రైజ్ విజేత)
ఒక పురుషుడికి చదువు చెబితే ఒక వ్యక్తికి మాత్రమే విద్యను అందించినట్లు అవుతుంది. కానీ ఒక స్త్రీకి చదువు చెబితే ఒక కుటుంబానికి అనగా యావత్ సమాజానికి విద్యను అందించినట్లు అవుతుంది
_డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్_
(భారత రాజ్యాంగ నిర్మాత )
ఈ వాక్యాలు అక్షరాస్యత అంటే
కేవలం అక్షర పరిజ్ఞానం కాదని అది సామాజిక మార్పుకు దివ్యమైన ఆయుధమని నిర్వచించారు.
యునెస్కోఅంతర్జాతీయఅక్షరాస్యత దినోత్సవం2026 థీమ్*
ప్రకటించింది.వ్యక్తులు గ్రహం మరియు సమృద్ధి కోసం అక్షరాస్యత ఈ మూడు కోణాలతో ఈ సంవత్సరం అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
అక్షరాస్యత ప్రతి ఒక్కరిలో సమ్మిళితత్వాన్ని పెంపొందిస్తుంది
మరియు జీవిత కాల అభ్యాసానికి పునాది వేస్తుంది.
అక్షరాస్యులైన సమాజం పర్యావరణ సవాళ్లను సులభంగా అర్థం చేసుకోగలదు
ప్రకృతిని రక్షించడానికి సుస్థిరమైన జీవన విధానాన్ని అవలంబించడానికి దోహదపడుతుంది..
అక్షరాస్యత లేని సమాజం పునాదులు లేని ఇల్లు లాంటిది. శతాబ్దాల కాలంగా మానవాళి సాధించిన ప్రగతికి అక్షరాస్యతయే పునాది.
నేటి డిజిటల్ యుగంలో కేవలం సంతకం పెట్టడమే తెలిస్తే సరిపోదు. సాంకేతికను అర్థం చేసుకోగలగడం విజ్ఞానాన్ని సమాజ హితం కోసం ఉపయోగించకోగలగడం అక్షరాస్యతలో భాగమే .నూతన విద్యా విధానాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మించవలసిన బాధ్యత ఉన్నది.
అక్షరాస్యత ఉద్యమాలు….
అక్షరాస్యత అనేది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం. ఒక కుటుంబం ఆర్థిక స్థిరత్వం. ఒక సమాజం ప్రజాస్వామ్య శక్తి. ఒక దేశం యొక్క భవిష్యత్తుకు పునాది. 60వ వార్షికోత్సవ సందర్భంగా సవాళ్లను అధిగమించే ఉద్యమాల ఆవశ్యకత గురించి చర్చించాలి. అక్షరాస్యత ప్రాథమిక మానవ హక్కు .మానవ హక్కుల రక్షణకు స్వేచ్ఛకు పౌరసత్వానికి అక్షరాస్యత ద్వారలు తెరుస్తుంది .దేశంలో అక్షరాస్యత ఉద్యమాలు విస్తరించాలి.
అక్షరాస్యత సవాళ్లు…
నేటికీ దేశంలో పెద్దల అక్షరాస్యత సవాల్ గా మారింది. నిరక్షరాశుల్లో సమాజంలో ఎక్కువమంది మహిళలు దళితులు ఆదివాసీలు వలస కూలీలు మారుమూల ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న పాలు సమస్యల కారణంగా ఈ వర్గాలను చాలా వరకువిద్యా రంగంలోకి తీసుకురా లేకపోయాం. అక్షరాస్యత నేటి సాంకేతిక యుగంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే విద్యారంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరగాలి. అప్పుడు మాత్రమే వ్యక్తి స్వేచ్ఛ సమాజ అభివృద్ధికి దేశభక్తికి అక్షరాస్యత పునాదిగా నిలుస్తుంది.
అక్షరం ఒక ఆయుధం…
దానిని ప్రతి ఒక్కరికి అందించి అజ్ఞానాన్ని నిర్మూలించి సుసంపన్నమైన మరియు పర్యావరణ హితమైన రేపటి ప్రపంచాన్ని నిర్మిద్దాం.
మీ…
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎడ్యుకేషన్ ఫోరం కరీంనగర్
9440245771
