– అభివృద్ధి పనులకు భూమి పూజ….
– మండలాల అధ్యక్షులు…. జయానంద్ రెడ్డి, నల్లె నర్సప్ప
నారాయణపేట, సెప్టెంబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)
మగనూర్,మండలంలోని నేరడ్గం గ్రామంలో రేపు అనగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తన ఎంపీ నిధుల ద్వారా కామన్ వర్క్ షెడ్ కు భూమి పూజ, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు క్రిష్ణ మండల కేంద్రం క్రిష్ణ నది ఒడ్డున దత్తాత్రేయ స్వామి దేవాలయం దగ్గర భవిషత్ క్రిష్ణ పుష్కరాల ను దృష్టిలో పెట్టుకొని కర్మ ఖండలు జరుపుకొనుటకు ఎంపీ నిధుల ద్వారా కామన్ వర్క్ షెడ్ కు భూమి పూజ నిర్వహించుట జరుగుతుంది.
కావున ఉమ్మడి మండలంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు , మండల అఖిల పక్షం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు .
