• అభినందిస్తూ ఆశీర్వదించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం
నారాయణపేట, సెప్టెంబర్ 13 (జన ఉదయం ప్రతినిధి)
సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష కార్యదర్శులు పంకజ్ సింగ్, మనేందర్ పాల్ సింగ్, ఇండియా కోచ్లు డాక్టర్ మాక్స్వెల్, డాక్టర్ ఎంకే పాషా సైకిలింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీలలో హైదరాబాద్ బండ్లగూడ నాగోల్ లో 8 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య గల బాల బాలికలకు జరిగిన ప్రథమ క్యాడేట్ జాతీయస్థాయి సైక్లింగ్ రోడ్డు ఛాంపియన్షిప్ 2 కి.మీ. సైకిల్ పోటీలలో ఇండియా లోని 16 రాష్ట్రాల నుండి 356 మంది బాలబాలికలు పాల్గొన్న పోటీలలో, మన నారాయణపేట జిల్లా నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ఎం. ఆద్య , 8 వ, స్థానం (రాయికోడ్), , బి సాయి ప్రణతి రెడ్డి 7వ. స్థానం, బి. రితిక రెడ్డి 10 వ స్థానం (నర్వ), కలాల్ సాహస గౌడ్ 12వ స్థానం, కలాల్ సామ్య 13వ స్థానం (గురు లింగంపల్లి,) నంగి కుమార్ 6 వ స్థానం .(కున్సి) పాల్గొని, మంచి క్రీడా ప్రతిభను చాటి జాతీయస్థాయి సైక్లింగ్ సర్టిఫికెట్స్ పొందినట్లు బి.గోపాలం తెలిపారు. బి.గోపాలం మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా నుండి ప్రథమ జాతీయ స్థాయి సైకిల్ పోటీలలో 6 మంది చిన్నారి బాలబాలికలు పాల్గొని, ప్రశంసా పత్రాలు పొందడం చాలా ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి, మల్లేష్, పి ఈ టి త్రివేణి, కలాల్ రమేష్ గౌడ్, పార్వతమ్మ, రమేష్ రెడ్డి, విజయ్ కుమార్, పవన్ కుమార్ పాల్గొన్నారు.
