– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి
నారాయణపేట, సెప్టెంబర్ 20 (జన ఉదయం ప్రతినిధి)
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈ నెల 21న ఎబివిపి ఆధ్వర్యంలో జరిగే స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ ముఖ్య అతిథిగా హాజరవుతారని, మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 10గంటలకు స్థానిక బస్టాండ్ ముందు భాగంలోని వివేకానంద చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక రాంలీలా మైదానంలో సభ ఉంటుందన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
