కాళమ్మ అమ్మవారి దేవాలయ వీధిలో ఆజాద్ నగర్ వినాయక సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

– విజేతలకు బహుమతుల అందజేత

నారాయణపేట, సెప్టెంబర్ 24 (జన ఉదయం ప్రతినిధి)

నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ వీధిలో వెలిసిన కాళమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఆజాద్ నగర్ వినాయక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆ దేవదేవుడు ఆదిదేవుడైన విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజలు అనంతరం విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించడం జరిగింది.
ఇట్టి పోటీలలో గెలుపొందిన వారికి లైన్స్ క్లబ్ కోశాధికారి లైన్ బి అంబదాస్ రావు బహుమతులను స్పాన్సర్ చేశారు.
గెలుపొందిన వారికి లైన్స్ క్లబ్ అధ్యక్షులు టి నాగరాజు, కార్యదర్శి ఎస్ రమేష్ రావులు క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.
లైన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ఇలాంటి సందర్భంలో విద్యార్థులలో భక్తి భావం పెంపొందించడానికి మున్ముందు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని దానికి తగిన తోడ్పాటు లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తామని తెలియజేశారు.
కార్యక్రమంలో వినాయక అసోసియేషన్ సభ్యులు లయన్స్ క్లబ్ అధ్యక్ష, కోశాధికారులకు శాలువతో సత్కరించారు.
ఇట్టి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.