• మాల,మాల ఉపకులాలను విద్యా, ఉద్యోగాలకు దూరం చేసే కుట్రను తిప్పికొడతాం
• అగ్రకుల భావజాలంతోనే మాలలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం
• మాలల జేఏసీ జిల్లా కన్వీనర్ కల్వాల్ బాలరాజ్
నారాయణపేట, అక్టోబర్ 1 ( జన ఉదయం ప్రతినిధి)
నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గురువారం రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో అక్టోబర్ 4న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పోస్టర్ ఆవిష్కరించడం మాలల జేఏసీ నాయకులు.
ఈ సందర్భంగా మాలల జిల్లా జేఏసీ కన్వీనర్ కల్వాల్ బాల్ రాజ్ మాట్లాడుతూ….
మాలలు సంఘటితంగా పోరాడి రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రకుల భావాజాలం తోనే మాలలను విద్య ఉద్యోగాలకు దూరం చేసే కుట్ర చేస్తుందని అన్నారు. అలాగే మాలలను విద్యా ఉద్యోగాలకు దూరం చేసే కుట్రలో భాగంగానే రోస్టర్ నెంబర్ 22 ను మాల,మాల ఉప కులాలకు కేటాయించడం జరిగిందని దీనిని వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.
మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి మాట్లాడుతూ….
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనంతరం రోస్టర్ విధానం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ఫలాలను అందిస్తామని ప్రభుత్వం ప్రజలను నమ్మించి అశాస్త్రీయ పద్ధతిలో రోస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోస్టర్ విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం దగ్గర విధివిధానాలు రూపకల్పన లేకపోవడంతో ఇష్టానుసారంగా రిజర్వేషన్లను రోస్టర్ విధానం పేరుతో గ్రూప్ 3లో ఉన్న మాల,మాల 28 ఉపకులాలకు చెందిన విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది ప్రభుత్వం. రిజర్వేషన్ అమలు తర్వాత వచ్చినా ఏ నోటిఫికేషన్లలో కూడా గ్రూప్-3 సామాజిక వర్గాలకు ఒక్క పోస్ట్ కూడా కేటాయించలేదు. ముఖ్యంగా 15% రిజర్వేషన్ అనే పద్ధతిని ప్రభుత్వాలు కొనసాగించడం లేదు. పైగా ఓపెన్ క్యాటగిరి పేరుతో ఎన్ని పోస్టులు ఉన్నా కూడా అందులో సగం పోస్టులు ఓపెన్ క్యాటగిరి పేరుతో పక్కకు పెట్టి రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన వారికి జీరో పర్సెంట్ రిజర్వేషన్ ని అమలు చేయడం ముమ్మాటికి అగ్రకుల భావాజాలమే అవుతుందని అన్నారు.
మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునెప్ప మాట్లాడుతూ….
రోస్టర్ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభను విజయవంతం చేయడంతో పాటు మాలలు సంఘటితంగా పోరాడటం ద్వారానే మన హక్కులను పొందుతామని అన్నారు.
మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు పాలెం వెంకటయ్య మాట్లాడుతూ….
మాలలు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడకపోవడం వల్లే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఇప్పటికైనా మేలుకొని సంఘటిత పోరాటాల ద్వారానే రిజర్వేషన్ ఫలాలు పొందుతామని అన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ….
మాల మాల ఉపకులాలకు జరుగుతున్న ఈ అన్యాయంపై ఇప్పటికే రాష్ట్రంలో అనేక మంది మేధావులు మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటైన విషయం. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా పెంచాలనే అంబేద్కర్ ఆలోచన విధానానికి ఇది విరుద్ధమైన చర్యని వెంటనే రోస్టర్ విధానాన్ని సరించి మాల, మాల ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారి చంద్రశేఖర్ మాట్లాడుతూ…..
మాలలు చైతన్యవంతంగా ఆలోచించకపోవడం వల్లనే భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని దీని కేంద్రంగా మాలలను విద్యా ఉద్యోగాలకు దూరం చేయడమే లక్ష్యంగా అగ్రకుల పార్టీలు ఆలోచిస్తున్నాయని అన్నారు. సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ….
మాలలు ఇప్పుడిప్పుడే చైతన్యవంతం అవుతున్నారని మరింత చైతన్యవంతంగా మాలల హక్కుల కోసం పోరాడినప్పుడే సమాజంలో ఆత్మ గౌరవంగా బతుకుతామని అన్నారు. ఈ క్రమంలో జరిగే సభను విజయవంతం చేయడంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు….
బ్యాగరి సురేష్,బండారి ఆనంద్,,ఉజ్జల్లి రాజు, బండారి శేఖర్, శివ, బసవరాజ్, రవికుమార్, భీమేష్, బైని నరసింహ,అంజప్ప,నరేష్,
వెంకటయ్య,అశోక్,పరశురాం,శాంతప్ప,
బండారి కథలప్ప ,బండారి మహదేవ్, బండారి భీమేష్ ,బండారి రవి, ఉదయ్,బండారి మలేష్, వరమూర్తి, సాయి, ఉదయ్, అరవింద్, పుట్ట చెన్నప్ప, రాకేష్, నాగేష్,అంజయ్య, హన్మంతు, బైని రవి కుమార్.పాలెం పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
