ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, అక్టోబర్ 8 (జన ఉదయం ప్రతినిధి )

నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌స్టాండ్‌ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ప్రియాంక గురువారం నెలవారీ తనిఖీలో భాగంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరిచిన గోదాము పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. గోదాము భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంలు, వీవీప్యాట్‌ల భద్రత విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. గోదాము వద్ద నిరంతర భద్రతా పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

తనిఖీ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, సీ సెక్షన్ అధికారిని జయసుధ, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.