అమ్మ ప్రేమకు మించినది మరొకటి లేదు

– అమ్మ ఆత్మశాంతికై సేవా కార్యక్రమాలు

– అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ

– మాజీ మార్కెట్ చైర్మన్ పట్టపర్ల నరసింహ గౌడ్

నారాయణపేట, అక్టోబర్ 10 (జన ఉదయం ప్రతినిధి)

అమ్మ ప్రేమకు మించినది మరొకటి లేదని,అమ్మ ఆత్మశాంతికై సేవా కార్యక్రమాలు నిర్వహించుటలో భాగంగా uoతన పెద్ద కుమారుడైన అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగిందని మాజీ మార్కెట్ చైర్మన్ పట్టపర్ల నరసింహ గౌడ్ అన్నారు.
శనివారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ మాతృమూర్తి స్వర్గీయ పి లక్ష్మమ్మ 20వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలోని మహిళలకు పండ్లు బెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ మాట్లాడుతూ తన తల్లి వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని లక్ష్యంతో ఈరోజు మహిళలకు బెడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు వారి ఆత్మకు ఆ భగవంతుడు మనశాంతిని కలిగించాలని ఆయన ఆ భగవంతుని ప్రార్థించారు. భవిష్యత్తులో అమృత్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ సర్పంచ్ కొత్తకాపు గోవర్ధన్ రెడ్డ జుట్ల శంకరు చందాపురం అశోక్ కుమార్ గౌడ్ బండారి ఆనందు ఎల్లిగండ్ల బాలప్ప ఆంజనేయులు పండు జయప్రకాష్ వైద్య శాఖ సిబ్బంది భీమేష్ శ్రీలత మంజుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.