• అక్టోబర్ 11 నుంచి 20 వరకు 61వ వార్షిక బ్రహ్మోత్సవాలు
• ప్రత్యేక పూజలు, హోమాలు, వివిధ వాహన సేవలు..
• 20న శ్రీవారి కళ్యాణం కనకాభిషేకం, 11 గం:కు శ్రీవారి రథోత్సవం, షమీ పూజ
నారాయణపేట, అక్టోబర్ 10( జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో 61వ సంవత్సర బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు అని పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు శ్యాంసుందర్ జోషి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు.
పురాతన ఆలయంలో వైభవంగా ఉత్సవాలు…
పురాతన కాలం నుంచి యజ్ఞయాగాలకు ప్రసిద్ధిగాంచిన మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది . ఈ ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా జరుపుతున్నారు.
ఈ ఏడాది 61వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు స్వామివారి సేవల్లో భాగస్వామ్యం చేయనున్నారు .
11న ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం…
అక్టోబర్ 11వ తేదీ ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా 12న సూర్యప్రభ, చంద్రప్రభ, 13న కల్పవృక్ష, 14న మండప వాహనం , 15న గరుడ వాహనము , 16న సుదర్శన హోమం ఆంజనేయస్వామి వాహనం , 17న సింహ వాహనం , 18న అశ్వ వాహనం , 19న గజ వాహన శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుండి పురవీధుల నువ్వుండా స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
20వ తేదీ మంగళవారం ఉదయం 8.30 గంటలకు శ్రీ వారి కల్యాణం, కనకాభిషేకం నిర్వహించనున్నట్లు శ్యాంసుందర్ జోషి పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు శ్రీ వారి రథోత్సవం, శమీ పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.
అక్టోబర్ 21వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ప్రతిరోజూ ప్రత్యేక పూజలు….
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు శ్రీ వెంకటేశ్వరస్వామి సుప్రభాతం, రజత పుష్పార్చన (108), నవనీత (వెన్న) హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రాత్రి 8 గంటలకు పంచామృతాభిషేకం, తులసి అర్చన, కుంకుమార్చన, మంగళహారతి వంటి పూజలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు పురాణ కార్యక్రమం, శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవతో రోజువారీ కార్యక్రమాలు ముగియనున్నాయి.
భక్తులకు ఆలయ కమిటీ ఆహ్వానం…
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఆహ్వాన ద్వారా కోరారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు శ్యాంసుందర్ చూసి వంశీ జోషి తెలిపారు .
