ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

•  జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS

• 575 మంది అభ్యర్థులు, పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయంలో చేరుకోవాలి

నారాయణపేట, అక్టోబర్ 10 (జన ఉదయం ప్రతినిధి)

నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్‌కు నిర్వహించనున్న ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో 575 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, పరీక్ష ప్రశాంతంగా జరిగేలా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష సమయం 10 గంటల నుండి ఒంటిగంట వరకు నిర్వహించడం జరుగుతుందని, తప్పనిసరిగా తమ వెంట హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులందరూ సమయపాలన పాటిస్తూ పరీక్షకు హాజరై, విజయవంతంగా ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలని కోరారు.
ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అర్హులైన అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్‌తో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంద ఎస్పీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.