18 ఏళ్లు అధికారంలో ఉన్న అభివృద్ధి ఏం చేశారు?

• మక్తల్ అభివృద్ధి కొరకు ఏనాడైనా brs పార్టీ పాదయాత్ర చేశావా?

• మక్తల్–నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు చేపట్టబోతుంటే రాజకీయమా సిగ్గు సిగ్గు

• మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారిపై కాంగ్రెస్ నాయకుల తీవ్ర విమర్శలు.. చిట్టెంపై పదునైన ప్రశ్నలు

నారాయణపేట, అక్టోబర్ 18( జన ఉదయం ప్రతినిధి)

మక్తల్–నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం అంశంపై రాజకీయ వివాదం మరింత పెరిగింది. రూ.237 కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి పనులు మరో 15 రోజుల్లో ప్రారంభమవుతాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాదయాత్రపై కాంగ్రెస్ నాయకులు పదునైన వ్యాఖ్యలు చేశారు.

18 ఏళ్లు అధికారంలో ఉన్న అభివృద్ధి ఎక్కడ?

ఆదివారం మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కురి రవికుమార్ లు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేపై ప్రశ్నలు విరుచుకుపడ్డారు.

“చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నిత్యం మక్తల్ మీదుగానే నారాయణపేటకు రాకపోకలు సాగించారు. అయితే, వారి హయాంలో పదేళ్లపాటు పేట రోడ్డును పూర్తి చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు?” అని నాయకులు ప్రశ్నించారు.

‘ఉనికి కోసమే పాదయాత్ర’….

రోడ్డు పనులు ప్రారంభమవుతాయని తెలిసిన తర్వాత కేవలం క్రెడిట్ కోసం మాజీ ఎమ్మెల్యే పాదయాత్రకు దిగారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రోడ్డు పూర్తయితే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని భావించి, ఉనికిని కాపాడుకోవడానికే ఈ నాటకం చేస్తున్నారని విమర్శించారు.
చిట్టెం రామ్మోహన్ రెడ్డి దాదాపు 18 ఏళ్లు అధికారంలో ఉన్నా మక్తల్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వలేదని, కేవలం జీవోలు, కాగితాలకే పరిమితమయ్యారని వారు ఆరోపించారు.

అభివృద్ధి లెక్కలపై సవాలు…

సంగంబండ బండరాయిని ఎందుకు పగలగొట్టలేదని, వంద పడకల ఆసుపత్రిని ఎందుకు ప్రారంభించలేదని, మక్తల్‌లో డయాలసిస్ కేంద్రం ఎందుకు చేపట్ట లేదని, డిగ్రీ కళాశాల తరగతులు ఎందుకు సరిగా నడవలేదని నాయకులు ప్రశ్నించారు.

మంత్రి వాకిటి శ్రీహరి వచ్చాక….

మంత్రి వాకిటి శ్రీహరి అధికారంలోకి వచ్చిన తర్వాత బండరాయి పగలగొట్టడం, 150 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి మరో 15, 20 రోజుల్లో ప్రారంభించడానికి సిద్ధం చేసుకోవడం, డయాలసిస్ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని వారు చెప్పారు.

మక్తల్‌ ఇంత అభివృద్ధి జరగడం ఎప్పుడు చూడలేదు….

ఆత్మకూర్–గద్వాల మధ్య రూ.100 కోట్లకు పైగా నిధులతో కొత్త బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయని, చిట్యాల, మంథన్ గౌడ్ గొలపల్లి, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయ్యాయని ఈ పనులన్నీ తమరి కండ్లకు కనబడవా అంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు .
అచ్చంపేట, గురజాల వంటి గ్రామాల్లో రోడ్లు లేని చోట్ల రోడ్లు ఏర్పాటయ్యాయని, మున్సిపాలిటీల్లో సిసి రోడ్ల నిర్మాణం పూర్తయిందని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో సహా దాదాపు రూ.1,800 కోట్ల నిధులు మక్తల్‌కు తీసుకువచ్చారని వారు పేర్కొన్నారు.

మక్తల్‌ అభివృద్ధికి అంకితమైన నాయకుడు…

మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లోనే పుట్టి, మక్తల్‌లోనే పెరిగారని, చివరి శ్వాస వరకూ మక్తల్‌కే అంకితమవుతారని నాయకులు పేర్కొన్నారు. మక్తల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కలాల్ శ్రీవిద్య నీల గౌడ్, జుట్ల అనిత, మార్కెట్ డైరెక్టర్ ఫయాజ్, జుట్ల శంకర్, మూర్తి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అఫ్రోజ్, అశోక్ గౌడ్, కావలి తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.