Income Tax Rules 2026: ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదా విడుదల.. భారీ సరళీకరణ

Income Tax Rules 2026: ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదాతో భారీగా తగ్గిన నియమాలు, ఫారమ్‌లు, భాష సరళీకరణ, క్రిప్టో ఆస్తులపై స్పష్టత ఉన్నాయి

Income Tax Rules 2026: ఆదాయపు పన్ను శాఖ శనివారం ఆదాయపు పన్ను నియమాలు, 2026 సంబంధించిన కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఈ ముసాయిదా నియమాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. పన్ను దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేయడం, సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఉన్న క్లిష్టతను తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త ముసాయిదా ద్వారా నియమాలు, ఫారమ్‌ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను నియమాలు–1962లో మొత్తం 511 నియమాలు, 399 ఫారమ్‌లు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఇవి 333 నియమాలు, 190 ఫారమ్‌లకు పరిమితం అవుతాయి. అవసరం లేని నిబంధనలను తొలగించి, ఒకే విధమైన అంశాలను ఏకీకృతం చేయడం వల్ల పన్ను వ్యవస్థలో ఉన్న సంక్లిష్టత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

సాధారణ పన్ను చెల్లింపుదారులు సులభంగా అర్థం చేసుకునేలా ఫారమ్‌ల భాషను సరళీకరించారు. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రస్తావించారు. పరిపాలనా, చట్టపరమైన సమస్యలు తగ్గించేలా మార్గదర్శకాలు కూడా స్పష్టంగా రూపొందించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Income Tax Rules 2026: ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రజలకు అందుబాటులో ఉంచింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఫిబ్రవరి 22, 2026 వరకు ప్రజలు, వాటాదారులు తమ సూచనలు ఇవ్వవచ్చు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నియమాలను అమల్లోకి తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది.

కొత్త ఆదాయపు పన్ను బిల్లులో కీలక మార్పులు ఉన్నాయి. ఇకపై “అసెస్‌మెంట్ ఇయర్” అనే పదానికి బదులుగా “టాక్స్ ఇయర్” అనే పదాన్ని ఉపయోగించనున్నారు. బిల్లులోని పేజీల సంఖ్యను 823 నుంచి 622కి తగ్గించినప్పటికీ, అధ్యాయాల సంఖ్యను 23గానే ఉంచారు. విభాగాల సంఖ్యను 298 నుంచి 536కి పెంచగా, షెడ్యూల్‌లు 14 నుంచి 16కి పెరిగాయి.

Income Tax Rules 2026: ముఖ్యంగా క్రిప్టో ఆస్తులను వెల్లడించని ఆదాయంగా పరిగణిస్తారు. నగదు, బులియన్, ఆభరణాల తరహాలోనే డిజిటల్ ఆస్తులపై కూడా స్పష్టమైన నిబంధనలు వర్తిస్తాయి. అలాగే పన్ను చెల్లింపుదారుల హక్కులను కాపాడే “టాక్స్‌పేయర్ చార్టర్”ను బిల్లులో చేర్చారు. జీతానికి సంబంధించిన డిడక్షన్లు, స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అంశాలను ఒకే చోట పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *