– జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి క్రీడాకారులను పరిచయం చేసిన రిటైర్డ్ పిఈటి బి.గోపాలం
– జాతీయ క్రీడాకారులైన బి.రూప,బి .దీప, బి .శిల్ప ,బి .పుష్ప
– నాడు కూతుర్లు పుట్టారన్న బాధ నేడు అదే కూతుర్లు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారన్న పట్టరాని ఆనందం
– కూతుర్లను కొడుకుల్లాగా పెంచిన తల్లిదండ్రులు బి గోపాలం కీర్తిశేషులు బి వెంకటమ్మలు
నారాయణపేట, సెప్టెంబర్ 26 (జన ఉదయం ప్రతినిధి)
సెప్టెంబర్ 27 4వ ఆదివారం జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా, నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మ కుంటలో నివసిస్తున్న విశ్రాంత పీఈటి బి.గోపాలం కీర్తిశేషులు బి. వెంకటమ్మ నలుగురు కూతుర్లు బి .రూప ,బి .దీప, బి .శిల్ప ,బి .పుష్పలు
మొదటి కూతురు బి.రూప…
మక్తల్ మండలం కర్ని కర్నే గ్రామ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా తన విధులు నిర్వహిస్తున్నారు.
2000 నుండి 2004 వరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మక్తల్ ఎందు, తరువాత మణికంఠ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ పిఈటి తండ్రి ప్రోత్సాహం తో తో క్రీడల్లో రాణిస్తూ 16 జిల్లాలలో వివిధ క్రీడల్లో రాసస్థాయిలో పాల్గొని, ఉత్తర ప్రదేశ్ ,మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో జరిగిన జాతీయస్థాయి ఖో ఖో క్రీడల్లో ఏపీ జట్టు కెప్టెన్‌గా వివరించి ప్రశంసా పత్రాలు పొందినది. 2007లో జరిగిన పీసెట్ లో ఆరో ర్యాంకు సాధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పూర్తి చేసి 2009లో తాను చదివిన పాఠశాలకు పీలేటి ఉద్యోగం పొంది, బాలికలకు క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇచ్చి అనేకమందిని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలకు పంపినది, 2018లో కర్ని ఉన్నత పాఠశాలకు బదిలీ అక్కడ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చి 12 మందిని జాతీయస్థాయి క్రీడలకు పంపినది జిల్లా ఉత్తమ ఫీడ్ అవార్డు పొందినది దూరవిద్య ద్వారా డిగ్రీ ,బి పి డి ,ఎంఏ, ఎంపీడీ , ఖో ఖో ఎన్ ఐ ఎస్ పూర్తి చేసినది, ఇండియా ఖో ఖో రే ఫ్రీ ఎగ్జామ్ పాస్ అయినది. ప్రస్తుతము మూడో సంవత్సరము పీహెచ్డీ చేయుచున్నది. తెలంగాణ ఖోఖో కోచ్, ఈనెల 5 నుండి 12 వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున జపాన్ దేశం లో క్రీడా విధానాన్ని పరిశీలించి వచ్చినది. కర్ని పాఠశాలలో స్వార్థ ఖర్చులతో రాసస్థాయి క్రీడలు నిర్వహించినది. బి.రూప గత ఐదు సంవత్సరముల నుండి ఆలిండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో తెలంగాణ ఖో ఖో జట్టు కెప్టెన్ గా ఆడుచున్నది.
రెండవ కూతురు బి. దీప…..
ఎస్ జి టి టీచర్ 2001 నుండి 2005 వరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్న పాఠశాల మక్తల్ లో 6వతరగతి నుండి 10వ తరగతి వరకు, తరువాత 2007 వరకు మణికంఠ జూనియర్ కళాశాల మక్తల్ యందు ఇంటర్ చదువుతూ క్రీడల్లో శిక్షణ పొంది 14 జిల్లాలలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు పొందినది. 2004లో మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన జాతీయస్థాయి ఖో ఖో క్రీడల్లో పాల్గొని వెండి పథకం సాధించినది 2006లో మధ్యప్రదేశ్ భోపాల్ లో జరిగిన జాతీయ ఖో ఖో క్రీడల్లో పాల్గొన్నది. 2008 నుండి 2010 వరకు మహబూబ్‌నగర్ టిటిసి కళాశాలలో చదివి, డీఎస్సీ ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించి 2012లో మాగనూరు మండల కేంద్రం లో గల ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్‌గా ఉద్యో గం సంపాదించినది. తర్వాత జిల్లా ఉత్తమ టీచర్ అవార్డు పొందినది. దూరవిద్య ద్వారా బీఈడీ పూర్తి చేసి ,ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ గా మక్తల్ ప్రాథమిక పాఠశాల (జిపి )లో పనిచేయుచున్నది. బి. దీప గత ఐదు సంవత్సరముల నుండి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో తెలంగాణ జట్టు తరపున ఖోఖో క్రీడల్లో పాల్గొంటుంది.
మూడవ కూతురు బి .శిల్ప….
వెటర్నరీ అసిస్టెంట్ 2002 నుండి 2005 వరకు జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుండి 8వ తరగతి వరకు 2005 నుండి 2007 వరకు ఆదర్శ ఉన్నత పాఠశాలలో9వ, 10వ తరగతి చదివి ,2007 నుండి 2010 వరకు మణికంఠ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసినది. విద్యార్థి దశలో తండ్రి దగ్గర కోకో క్రీడల్లో మెరుగైన శిక్షణ పొంది ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు పొంది. 2007లో ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన జాతీయస్థాయి ఖో ఖో క్రీడల్లో పాల్గొని కాంస్యపథకం పొందినది.2010 -2012 వరకు మహబూబ్‌నగర్ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో చదివి, తరువాత 2012 నుండి 14 వరకు హైదరాబాద్ దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పి ఈ టి ట్రైనింగ్ పూర్తి చేసి, గురుకుల పాఠశాలలో పిఉటి ఉద్యోగం వచ్చిన చేయలేదు.2017లో వెటర్నరీ అసిస్టెంట్ గా కొత్తకోట వెటర్నరీ హాస్పిటల్ లో ఉద్యోగం పొందినది. తర్వాత ఆత్మకూరులో పనిచేసే ప్రస్తుతము ప్రమోషన్ పై జక్లేర్ వెటర్నరీ హాస్పిటల్ లో పనిచేయుచున్నది. బి. శిల్ప గత నాలుగు సంవత్సరముల నుండి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అథిలేటిక్స్, ఖో ఖో క్రీడల్లో తెలంగాణ జట్టు తరుపున ఆడుచున్నది.
నాలుగోవ కూతురు బి .పుష్ప…..
పి ఈ టి గా విధులు నిర్వహిస్తున్నారు. 2005 నుండి 2010 వరకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సాయి జ్యోతి ఉన్నత పాఠశాలలో మక్తల్ నందు , ఇంటర్ 2012 వరకు మణికంఠ జూనియర్ కళాశాలలో చదివినారు . విద్యార్థి దశలో తండ్రి పి ఈ టి దగ్గర వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ క్రీడల్లో శిక్షణ పొంది, అతిలెటిక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాలలో రాష్ట్ర స్థాయి ఖో ఖో క్రీడల్లో పాల్గొని, ప్రశంస పత్రాలు పొందినది. 2009 ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన జాతీయస్థాయి ఖో ఖో క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రం పొందినది. 2010లో మధ్యప్రదేశ్ రాష్ట్ర శత్రుపుర లో జరిగిన జాతీయస్థాయి ఖో ఖో క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించినది. 2013 పీసెట్ ఎగ్జామ్ లో పాల్గొని రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి హైదరాబాద్ దోమలగూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో 2016 లో ట్రైనింగ్ పూర్తి చేసి 2020లో పిటి ఉద్యోగం సంపాదించి మహబూబ్‌నగర్ గర్ల్స్ హైస్కూల్ గా పి.టి ఉద్యోగము పొందినది. ప్రస్తుతము బదిలీపై మహబూబ్‌నగర్ రాంనగర్ హై స్కూల్లో పిఈటిగా పనిచేయుచున్నది దూరవిద్యలో బీపీడీ పూర్తి చేసినది గత నాలుగు సంవత్సరముల నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ తెలంగాణ ఖో ఖో జట్టు తరుపున ఆడుచున్నది.
ఇలా నలుగురు కూతుర్లను కొడుకు లేకపోయినా వారిలో కొడుకులను చూసుకుంటూ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన విశ్రాంతి పేటీ గోపాలనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. గోపాలం కూతుర్లను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
