– ఘనంగా చిన్ననాటి గురువులకు సన్మానం
– నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆనందోత్సవాల్లో 1990_91 పూర్వ విద్యార్థులు
నారాయణపేట, సెప్టెంబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)
స్థానిక మక్తల్ పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం S.S.C బ్యాచ్ 1990_91 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. గత 35 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకొని తమకు చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో చదువుతో పాటు క్రమశిక్షణ, చక్కటి సంస్కారం, విద్యాబుద్ధులు అందించిన గురువులు విశ్రాంత జి.హెచ్.ఎం రమేష్ శెట్టి, విశ్రాంత ఉపాధ్యా యులు ఎం. శివకుమార్, మనోహర్, ఎల్లప్ప,అరుణ టీచర్లను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించి గురువులకు పాదాభివందనం చేయడం జరిగింది. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ పరస్పరం యోగక్షేమాలు తెలుసుకొని ఆనందంగా గడిపారు. ఇట్టి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
