JICE ED అకావో తకాశి, తెలంగాణ పాఠశాలల డైరెక్టర్Dr. E నవీన్ నికోలెస్ చే ప్రశంసా పత్రాన్ని అందుకున్నా కర్ని ఫిజికల్ డైరెక్టర్ B.రూప

– జపాన్ రాజధాని టోక్యో పర్యటన ముగించుకుని ఇండియాకు రాక

– వివిధ రకాల పాఠశాలలు , టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పాఠశాల ల ను సందర్శించిన రూప

– రూపును అభినందించిన మక్తల్ ప్రాంత వాసులు

నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి)

టీచర్స్ ఎక్స్పోజర్ విసిట్, ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విదేశీ విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని 40 మంది ఉపాధ్యాయుల బృందము జపాన్ పర్యటన ఈనెల 11 తో ముగిసింది. ఈ బృందంలో సభ్యురాలైన మక్తల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కర్ని ఫిజికల్ డైరెక్టర్ B.రూప కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బీరూప
విలేకరులతో విదేశీ పర్యటన అనుభవాలను పంచుకున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో వివిధ రకాల పాఠశాలల, టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పాఠశాల ల ను సందర్శించి ప్రాథమిక స్థాయి నుండి పిల్లలకు స్వేచ్ఛగా పాఠాలు నేర్పిస్తూ వ్యాయామ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత పరిశుభ్రమైన తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి సాంకేతికత, క్రీడా మైదానాలు స్విమ్మింగ్ పూల్స్ ఆధునిక సౌకర్యాలతో విద్యను అందిస్తున్నారని రూప తెలిపారు. ఈ సందర్భంగా JICE ED అకావో తకాశి మరియు తెలంగాణ పాఠశాలల డైరెక్టర్Dr. E నవీన్ నికోలెస్ గారిచే ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులు వేయి రూపాలు ఎంతగానో అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.