మూగ జీవి ప్రాణాలను కాపాడబోయి అనంత లోకాలకు వెళ్లిన గొర్రెల కాపరి

– లారీ కింద వెళ్లిన గొర్రె ఎక్కడ చనిపోతాదో అంటూ రక్షించడానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వైనం

– ఎడివెల్లి గ్రామంలో విషాదఛాయలు

– మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు

నారాయణపేట, సెప్టెంబర్ 25 (జన ఉదయం ప్రతినిధి)

మూగజీవులే తనకు ఆధారంగా భావిస్తూ వాటి పోషణ చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఓ గొర్రెల కాపరి తన మూగజీవు ఎక్కడ లారీ కింద పడి చనిపోతుందో అన్న భయంతో వాటిని కాపాడబోయి చివరికి తన ప్రాణాలను కోల్పోయి అనంత లోకాలకు వెళ్లిన సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్చ్ ఫర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఉట్కూరు మండలం ఎడివెల్లి గ్రామానికి చెందిన నాగరాజు(32) అనే యువకుడు తన మూగజీవులను గొర్రెలను మేపుకుంటూ రోడ్డుపై వస్తున్న సందర్భంలో ఓ చిన్న గొర్రె పిల్ల లారీ క్రిందకు వెళ్ళింది. అట్టి గొర్రె పిల్లను కాపాడబోయి లారీ ఢీకొని నాగరాజు (32)కు తీవ్ర గాయాలయ్యాయి రక్తస్రావంతో మృతితో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును 108 అంబులెన్స్ లో మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృత్యు బారిన పడ్డాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఎస్సై రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎడివెల్లి గ్రామంలో విషాద ఛాయలు….

గొర్రెల కాపరి నాగరాజు మృతితో ఉపకూరు మండలం ఎడవల్లి గ్రామంలో విషాదఛాయలు. ఇంటికి పెద్దది ఎక్కువగా నిలిచిన నాగరాజు మృతి బారిన పడడంతో భార్య పిల్లలు అనాధలు అయిపోయారు. అట్టివారిని చూసిన ఇరుగుపొరుగు వారందరూ కన్నీరు మునిగి విలపించారు. ఇంత చిన్న వయసులో నాగరాజుకు ఆ భగవంతుడు శిక్ష వేయడం అనేది సహించుకోలేకపోతున్నామని అంటున్నారు. గొర్రెల కాపరి నాగరాజును ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.