• భారతదేశ మొత్తంగా అలరించిన వందేమాతరం గీతాలాపన
• 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గీతం వందేమాతర గీతం
• భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర
నారాయణపేట, సెప్టెంబర్ 25 (జన ఉదయం ప్రతినిధి)
వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన మఖ్తల్ పట్టణంలోని శివాజీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం వందేమాతరం గీత ఆలాపనం చేయడం జరిగింది.
భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వందేమాతర గేయం 150 ఏళ్ల సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం – అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో నమామి భారతం అనే పేరుతో 25 సెప్టెంబర్ 2026 ఉదయం 11 గంటలకు భారతదేశ వ్యాప్తంగా సామూహిక సంపూర్ణ వందేమాతర గీతాలాపన అనే విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది.
శివాజీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ – పాత బజార్ యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యా భారతి సభ్యులు, శివాజీనగర్ గణేష్ కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ సభ్యులు, కరెంట్ డిపార్ట్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
