– మాగనూర మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
– ముఖ్యఅతిథిగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు
– మాగనూరు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కడుమూరు ఎల్లారెడ్డి పిలుపు
నారాయణపేట, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి )
మక్తల్ మాజీ శుభాకాంక్షలు చిట్టెం రాంమోహన్ రెడ్డి ఆదేశానుసారం మేరకు 08 తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు మాగనూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాం దగ్గర వారికీ పూలమాల వేసి అంబేత్కర్ విగ్రహానికీ వినతిపత్రం సమర్పించ వలసి ఉంటుందని మాగనూరు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కడుమూరు ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మాగనూరు మండలంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మన మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు అంటూ తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా మన రాష్ట్రం లో కాంగ్రేస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలపైన విఫలం చెందిన సందర్బంగా దాదాపు సెప్టెంబర్ 2 తేదీనుండి 8 తేదీ వరకు రోజు ఒక్కో కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంగళవారం రోజు చివరిరోజు కావడంతో మాగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాం దగ్గర వినతిపత్రం సమర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. కావునా ఇన్ని రోజులు ఒక్క ఎత్తాయితే రేపు చివరి రోజు కావునా మాగనూర్ మండల BRS పార్టీ ప్రజా పాతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు BRS కుటుంబసభ్యలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజవంతం చేయగలరని కడుమూరు ఎల్లారెడ్డి పిలుపునిచ్చారు.
