వాసవి, వనిత క్లబ్ ఆధ్వర్యంలో వాసవి గురువులకు ఘనంగా సన్మానం

– వాసవి క్లబ్ అధ్యక్షులు హరికృష్ణ, వనిత క్లబ్ అధ్యక్షురాలు కలవాలా ప్రసన్న ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు

– విజయవంతమైన ఏడవ రోజు వాసవి వారోత్సవాలు

నారాయణపేట, సెప్టెంబర్ 7 (జన ఉదయం ప్రతినిధి)

కేసి గుప్తా జన్మదిన వేడుకలు, వాసవి వారోత్సవాల సందర్భంగా సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో
వాసవి, వనిత క్లబ్ మక్తల్ వారి ఆధ్వర్యంలో వాసవి గురువులకు ఘన సన్మానం నిర్వహించారు. ఏడవ రోజు ఇట్టి కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది.
ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వనిత క్లబ్ అధ్యక్షురాలు కలవాలా ప్రసన్న మాట్లాడుతూ నేను అధ్యక్షురాలు కావడానికి నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టినటువంటి వాసవి క్లబ్స్ అంతర్జాతీయం మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ బిలకంటి జగదీష్ రాయచూర్ వారు,వాసవి వనిత క్లబ్ మక్తల్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దేవీ పద్మావతి మరియు వనిత క్లబ్ మాజీ అధ్యక్షురాలు దొంత లావణ్య అన్ని కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని చెప్పి ముందుకు నడిపిస్తున్నారు అన్నారు. అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలు బౌరీశెట్టి పద్మ మాజీ అధ్యక్షురాలు మన్సాని సరళ అన్ని కార్యక్రమాల్లో మాకు సహకరిస్తూ క్లబ్ కార్యక్రమాలను దిగ్విజయడం చేయడానికి తోడ్పడుతున్నారు అంటూ కొనియాడారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బౌరీశెట్టి భాస్కర్ టీచర్ ,వాసవి దేవాలయ నిర్వాణ కమిటీ మాజీ అధ్యక్షులు మన్సాని వెంకటేష్ ,ex Rigion చైర్మన్ కల్వ శ్రీనివాస్ మరియు డిస్టిక్ వి 108 ఏ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ మన్సాని నాగరాజు, వాసవి క్లబ్ అధ్యక్షులు హరికృష్ణ వీరు వనిత క్లబ్ కార్యక్రమాలకు సలహాలు సూచనలు చేస్తూ కార్యక్రమాలకు తోడ్పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వనిత క్లబ్ మక్తల్ ఉపాధ్యక్షురాలు బిలకంటి శ్రీలత నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాంటి వాసవి గురువులకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు కలవాలా ప్రసన్న.

వనిత క్లబ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు…

ఏడవ రోజు గ్రామీణ ఆటలలో భాగంగా వనిత క్లబ్ సభ్యులచే కబడ్డీ ఆట ఆడించడం జరిగినది ఇట్టి ఆటలో వయసులో పెద్దవారైనా మా అందరితో క్రీడా స్ఫూర్తితో ఆట ఆడి అందర్నీ ఆనందపరిచిన వాసవి వనిత క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (చాటర్ ప్రెసిడెంట్) దేవి పద్మావతి టీం వారు మొదటి బహుమతి గెలుచుకున్నారు. పోలిశెట్టి కీర్తి & టీం వారు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు.

ఇట్టి కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు కల్వాల ప్రసన్న వనిత క్లబ్ సభ్యులు దేవీ పద్మావతి, బౌరీశెట్టి పద్మ , ఆగ్లర్ రేఖ, శెట్టి శిరీష , కొండా నిర్మల, చెల్లా రూప, మేడిశెట్టి త్రివేణి, మన్సాని ప్రత్యూష, వట్టం అనూష, సిద్ధంశెట్టి స్వాతి, బిలకంటి సృజన, కల్వల అనూష, బిలకంటి శ్రీలత, తాళంపల్లి వాణి, పోలిశెట్టి కీర్తి, వడ్డేవాటి సుజాత, దంతా లావణ్య , వట్టం కావ్య తదితరులు పాల్గొన్నారు.

వాసవి వారోత్సవాలను ఏడు రోజులు పరిపూర్ణంగా కార్యక్రమం దిగ్విజయం కావడానికి సహకరించిన వనిత క్లబ్ మక్తల్ , ఆర్యవైశ్య మహిళా సంఘం మక్తల్ మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు అంటూ కల్వల ప్రసన్న అధ్యక్షురాలు వాసవి వనిత క్లబ్ ,
కౌకుంట్ల నందిని ప్రధాన కార్యదర్శి వాసవి వనిత క్లబ్ , తాళంపల్లి కావ్య కోశాధికారి వాసవి వనిత క్లబ్ వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.