AP Employees: ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయడం అవసరం

AP Employees: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయడం ఎంతో అవసరమనీ, అందుకు తగ్గట్టుగా తమ తమ రంగాల్లో సాంకేతిక నైపుణ్యాలను అవర్చుకోవాలనీ అన్నారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా.పి. క్రిష్ణయ్య. ఏపీపీఎస్సీ ద్వారా నూతనంగా నియామకమైన 39 మంది ఉద్యోగుల శిక్షణార్ధం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అటవీ శాస్ర్త, సాంకేతిక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో మొత్తం 64 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (AEE) పోస్టులు, 36 అనలిస్ట్ గ్రేడ్–II పోస్టులు మంజూరు చేయబడి ఉన్నాయి. APPCBలో 21 AEE పోస్టులు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ నెం.15/2023(26.12.2023) , అలాగే, 18 Analyst Grade–II పోస్టులు భర్తీ చేయడానికి APPSC నోటిఫికేషన్ నెం.02/2024(09.02.2024) ద్వారా వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన 21 మందిని ఏఈఈ, 18 మందిని Analyst Gr.II పోస్టులకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసి… ఏపీపీసీబీకి తుది జాబితాను అందజేసింది. అర్హులైన 39 మంది అభ్యర్థులకు కాలుష్య నియంత్రణ మండలి నియామక ఆదేశాలు (14.10.2025) అందించి… సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

AP Employees: ఆ సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో చదివి సవాళ్లతో కూడిన ఏపీపీసీబీలో విధులు నిర్వహించేందుకు వచ్చిన యువతీ యువకులకు కాంతీలాల్ దండే అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడటంలో బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. దాదాపు పందొమ్మిదేళ్ల తరవాత జరిగిన రిక్రూట్ మెంట్ ద్వారా 39 మంది శాశ్వత ఉద్యోగులు చేరడంతో… కాలుష్య నియంత్రణ మండలి బోర్డు మరింత బలోపేతమైందని అన్నారు సభ్యకార్యదర్శి శ్రీ శరవణన్. ఈ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యాక ప్రధాన, జోనల్, ప్రాంతీయ కార్యాలయాల్లో బోర్డు అవసరాల మేరకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎమ్. రాజశేఖర్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ శ్రీరంజని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *