YCP: వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్ట్

YCP

YCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పలు టీవీ డిబేట్‌లలో పాల్గొంటూ వైసీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న వెంకట్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయండతో ఒక్కసారిగా కలకలం రేపింది.హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని కారుమూరు వెంకట్ రెడ్డి నివాసానికి తాడిపత్రి పోలీసులు మంగళవారం ఉదయం వచ్చారు. వెంకట్ రెడ్డిని విచారించాల్సి ఉందని చెప్పి ఆయనను అదుపులోకి తీసుకుని తాడిపత్రికి తీసుకెళ్లారు. తాడిపత్రిలో వెంకట్ రెడ్డిపై నమోదు అయిన కేసు విచారణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

YCP: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి అరెస్ట్‌పై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్ చేశారని కారుమూరు వెంకట్ రెడ్డి భార్య ఆరోపించారు. ‘తొలుత మా ఇంట్లోకి పోలీసులు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికే వచ్చామన్నారు… ఆ తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చామన్నారు… ఆఖరిగా విచారణ కోసం తీసుకెళ్తున్నాం అన్నారు’ అని వెంకట్ రెడ్డి సతీమణి హరిత అన్నారు.‘ఇంట్లోకి వచ్చీ రాగానే నా ఫోన్, మా ఆయన వెంకటరెడ్డి ఫోన్‌ను లాగేసుకున్నారు…ఎవరికీ సమాచారం ఇవ్వొద్దు అని బెదిరించారు.చాలా సేపు వాదించిన తర్వాత ఆఖరిగా నా ఫోన్ చేతికి ఇచ్చి వెంకటరెడ్డిని వారితో తీసుకెళ్లారు. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు’అని హరిత ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *