నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)
నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓగా టి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు జోగులాంబ గద్వాల జిల్లాలో సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కోస్గి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నూతన ఎస్ఐ టి. చంద్రశేఖర్ మాట్లాడుతూ… కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తామన్నారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఫిర్యాదులపై చట్ట ప్రకారం వేగంగా స్పందిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ కోరారు.
PRO SP Office…
