అక్రమంగా ఇసుక తరలిస్తున్న 02 టిప్పర్ల పట్టివేత

: ఉట్కూర్ ఎస్సై రమేష్

నారాయణపేట, సెప్టెంబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)

నారాయణపేట జిల్లా ఉట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను టాస్క్ ఫోర్స్, ఉట్కూరు పోలీసులు పట్టుకున్నారు.

ఉట్కూర్ మండలంలోని నారాయణపేట రోడ్డుపై ఒక ఇసుక టిప్పర్‌ను, అలాగే ఉట్కూర్ చెక్‌పోస్ట్ వద్ద మరో ఇసుక టిప్పర్‌ను పోలీసుల తనిఖీలలో పట్టుకున్నారు.

పట్టుబడిన టిప్పర్ల వివరాలు:

డ్రైవర్లు.
1. టిప్పర్ నంబర్: TG 38 T 2275
డ్రైవర్: పి. నరేందర్, తండ్రి నర్సింహులు, సెర్నపల్లి గ్రామం, నారాయణపేట మండలం.

2. టిప్పర్ నంబర్: TG 38 T 2430
డ్రైవర్: డి. హనుమంతు, తండ్రి రామచంద్రయ్య, సెర్నపల్లి గ్రామం, నారాయణపేట మండలం

యజమానులు…

1. పి. అజయ్, తండ్రి రాములు, వయస్సు 25 సంవత్సరాలు, సెర్నపల్లి గ్రామం, నారాయణపేట జిల్లా.

2. డి. రాజు, తండ్రి వెంకప్ప, సెర్నపల్లి గ్రామం, నారాయణపేట మండలం.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ యజమానులు, డ్రైవర్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.